Breaking News

Met Gala 2025: ఆ ఐదు ఆహార పదార్థాలపై నిషేధం.. రీజన్‌ తెలిస్తే!

Published on Mon, 05/05/2025 - 14:27

మెట్ గాలా (Met Gala) అంటే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art)  కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ (Costume Institute). ఇది అత్యంత ప్రసిద్ధమైన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. దీన్ని ప్రతి ఏడాది మే నెలలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహిస్తారు. దీన్ని  కొత్త ఫ్యాషన్ ప్రదర్శనకు నిధులు సమకూర్చడం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీన్ని  కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ వార్షిక ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించిన వేడుకగా పేర్కొంటారు కూడా. ఈ కార్యక్రమానికి ఫ్యాషన్‌, సినీ, వ్యాపార, క్రీడల, రాజకీయ ప్రముఖులంతా విచ్చేస్తారు. ఈ ఏడాది మే5 సాయంత్రం ఆరు గంటలకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ,  దిల్జిత్ దోసాంజ్ వంటి భారతీయ తారలు అరంగేట్రం చేయనున్నారు. దీన్ని వోగ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటౌర్ నిర్వహిస్తారు. ఇక ఈవెంట్‌లో అత్యంత ప్రసిద్ధి చెందింది పసందైన విందు మెనూ. ఈసారి ఈవెంట్‌లో ఎలాంటి వంటకాలు అందించనున్నారనేది వెల్లడి కాకపోయినా..ఆ ఫుడ్స్‌ని మాత్రం పూర్తిగా బ్యాన్‌ చేశారట. అవేంటి, ఎందుకని నిషేధించారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.

అన్నా వింటౌర్ నిర్వహించే ఈ వేడుకలో మెనూలో ఆ ఫుడ్స్‌ని ఆమె ఎందుకు నిషేధించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఏడాది మెట్ గాలా 2025(Met Gala 2025) డిన్నర్  నుంచి నిషేధించిన ఆహారాలు ఇవే..

1. వెల్లుల్లి
2. ఉల్లిపాయ
3. చివ్స్
4. పార్స్లీ
5. బ్రూషెట్టా

ఎందుకు నిషేధించారంటే..
ఈ ఐదింటిని ఎందుకు బ్యాన్‌ చేశారో లాస్ ఏంజిల్స్‌ గ్రేట్ టేస్ట్ క్యాటరింగ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ జాక్సన్ పరేడ్‌ వివరించారు. తాము అందించే ఆహారం సెలబ్రిటీల శ్వాసను, దంతాలను ప్రభావితం చేసేలా ఉండకూడదనే ఇలా ఆ ఐదు ఆహారాలకు చోటు ఇవ్వలేదట. అంతేగాదు ఆ ఐదు ఆహారాల వల్ల కలిగే అసౌకర్యం ఏంటో కూడా తెలిపారు. 

ఉల్లి, వెల్లుల్లి అంటే అలెర్జీ ఉన్నవారు చాలామంది ఉన్నారట. అలాగే పార్సీ కచ్చితంగా దంతాల్లో ఇరుక్కుని ఇబ్బంది పెడుతుందట. అందుకని దాన్ని మెనూలోంచి తొలగించారు. బ్రూషెట్టా కూడా రాత్రిపూట ఇచ్చే విందులో అసౌకర్యంగా ఉంటుందట. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పెట్టేస్తుందట. 

కాగా, ఈ ఏడాది మెట్‌గాలా కోసం ఫుడ్‌ మోనూని 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో అతిథులకు సర్వ్‌ చేయనున్నారు. దీన్ని అందించేది సెలబ్రిటీ చెఫ్ క్వామే ఒన్వుచి. ఈ అవకాశం తనకు లభించడం ఓ గౌరవమని అన్నారు ఒన్వుచి. న్యూయార్క్‌ సంస్థలో భాగం కావడం అనే తన ప్రోఫెషన​ల్‌ కల ఇన్నాళ్లకు నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఓఫ్యాషన్‌ ప్రేమికుడిగా 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌కి అనుగుణంగా వంటకాలు సిద్ధం చేసేలా చెఫ్‌ బృందంలో భాగం కావడం అనేది మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. 

(చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్‌ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్‌ ఛేంజర్‌..)
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు