Breaking News

ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీలో రాయి ఇదే.!

Published on Sat, 06/17/2023 - 13:54

ఈమధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. వీటివల్ల వచ్చే నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో ట్రీట్మెంట్‌ తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? వాటి లక్షణాలేంటి? ఈ సమ​స్య దరిచేరకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి వంటివి ఇప్పుడు చూద్దాం.


  కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు

  • కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి.
  • వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి.
  • ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
  • కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి.

ప్రపంచంలోనే పెద్ద కిడ్నీ స్టోన్‌
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ను శ్రీలంకలోని ఒక రోగి నుంచి వైద్యులు తొలగించారు. ఈ రాయి 5.26 అంగుళాల పొడవు, 801 గ్రాముల బరువు కలిగి ఉంది . ఈనెల ప్రారంభంలో శ్రీలంక ఆర్మీ వైద్యులు దీన్ని తొలగించారు. ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని శ్రీలంక మిలిటరీ హాస్పిటల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కూడా శ్రీలంకలోనే ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువైన కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. 



 కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఏం చేయాలి?

  • ముందుగా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి..అందులో ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది.
  • రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది.
  • ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి.
  • బరువు అధికంగా పెరగకుండా ఉండాలి.
  • కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి. 
  • తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది.

మంచి ఆహారం, తగు వ్యాయామాలు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)