‘బ్రేకింగ్‌ న్యూస్‌’తో వణికిపోయిన పిఠాపురం!

Published on Fri, 11/21/2025 - 12:34

40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పిఠాపురం అనే గ్రామం. ఆ ఊరిలోని సర్పంచ్‌ ఇంటి వరండాలో ఏర్పాటు చేసిన ఏకైక టీవీని చూసి ఊరి ప్రజలంతా హడలిపోతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఏ చిత్రలహరి పాటనో.. సినిమానో.. వార్తలో కాకుండా ఆ ఊరి ప్రజల గుట్టునే ‘‘బ్రేకింగ్ న్యూస్’’గా ప్రసారం చేయడం మొదలుపెట్టింది ఆ టీవీ. 

“బ్రేకింగ్ న్యూస్! రామయ్య పొలంలో పని చేయకుండా చెరువుకట్టపై నిద్రపోతున్నాడు!”.. టీవీలో చుక్కలు వస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పురుషుడి గొంతుతో గట్టిగా చెప్పింది. అది విని అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వుల్లో మునిగిపోయారు. ఆ వెంటనే ‘‘కిష్టయ్య భార్య అతనికి తెలియకుండా టౌన్‌కు వెళ్లి సినిమా చూస్తోంది’’ అనడంతో ఆ నవ్వులు మరింత పెరిగాయి. సీతమ్మ పొరుగింటి వంటకాలు రుచి చూసి.. తనింట్లో వండినవాటిని చెత్తబుట్టలో పడేస్తోంది అనగానే.. సీతమ్మ ముఖం వాడిపోగా జనం అంతా కేరింతలు కొట్టారు. అయితే..

ఆ టీవీ ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులు.. ఆశ్చర్యంలో మునిగిపోయిన ప్రజలు.. నెమ్మదిగా అది చెబుతున్న బ్రేకింగ్‌ న్యూస్‌ వింటూ ఆందోళనకు గురయ్యారు. అందుకు కారణం.. అది బయటపెడుతున్న రహస్యాలే!. దాని వల్ల ఊళ్లో వాళ్ల చిచ్చు రాజుకుంటోంది. కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చివరాఖరికి.. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే.. 

ఆ టీవీని కట్టేశారు. దానికి ఉన్న డిష్‌ యాంటేనాను పీకేయించాడు సర్పంచ్‌. అయినా అది ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ చెప్పడం ఆపలేదు. దీంతో ఊరి పెద్ద తలపట్టుకున్నాడు. చివరకు రచ్చబండ దగ్గరకు ప్రజలను ఆహ్వానించాడు. ఇకపై మనం నిజాయితీగా ఉందాం. అప్పుడు టీవీ మనల్ని బ్రేకింగ్ న్యూస్‌గా చూపించే అవకాశం ఉండదు అన్నాడు. దానికి అంతా సరే అన్నారు. 

ఆ రోజు నుంచి గ్రామంలో అబద్ధమనేది వినిపించలేదు. మోసాలు తగ్గాయి. ఎవరి ఇళ్లలో వాళ్లు కాపురాలు చేసుకుంటూ హాయిగా గడిపారు. ఆ టీవీ నేర్పిన గుణపాఠంతో నిజాయితీగా జీవిస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఆ టీవీ.. ఎప్పుడు ఏం బ్రేకింగ్‌ న్యూస్‌ దొరుకుతుందా? అని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది.

ఇవాళ(నవంబర్‌ 21..) ప్రపంచ టెలివిజన్‌ దినోత్సవం సందర్భంగా ఓ చిన్ని కల్పితకథ

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)