Breaking News

ప్రపంచ పజిల్‌ ఛాంపియన్‌షిప్‌లో.. తండ్రీ కొడుకులు

Published on Thu, 09/18/2025 - 14:42

సాక్షి, సిటీబ్యూరో: హంగేరీలోని ఎగర్‌లో జరగనున్న 18వ ప్రపంచ సుడోకు ఛాంపియన్‌ షిప్‌, 32వ ప్రపంచ పజిల్‌ ఛాంపియన్‌ షిప్‌లో నగరానికి చెందిన తండ్రి కొడుకులు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. హంగేరియన్‌ పజిల్లర్స్‌ అసోసియేషన్‌నిర్వహించే ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఎడ్జ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి, తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 24 గంటల పజిల్‌ ఛాంపియన్‌ షిప్‌ కూడా  ఉంటుంది. 

అనుభవజ్ఞుడైన పజిల్‌ ఔత్సాహికులు జైపాల్‌రెడ్డి మొదట 2007లో అధికారిక పజిల్‌ పోటీల్లో భాగస్వామ్యమయ్యారు. తన పాఠశాల రోజుల నుంచి పజిల్స్‌ అంటే చాలా ఇష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం అంతటా ప్రాంతీయ రౌండ్లలో పాల్గొన్న తర్వాత 2008 నాటికి జాతీయ జట్టులో స్థానం సంపాదించానని, ప్రస్తుతం అంతర్జాతీయ పజిల్‌ పోటీలలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని తెలిపారు. ప్రస్తుతం 23 ఏళ్ల కార్తీక్‌రెడ్డి ఈ అభిరుచిని వారసత్వంగా పొందారని, 2015లో ప్రారంభించిన తన ప్రయాణం త్వరితగతిన అంతర్జాతీయ స్థాయికి  ఎదిగిందని పేర్కొన్నారు. వీరు దివంగత కాంగ్రెస్‌ నాయకుడు ఎం.బాగారెడ్డి వారసులు కావడం విశేషం. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)