9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
పాల ఉత్పాదనలో మనమే టాప్!
Published on Sun, 05/31/2026 - 00:12
సులువుగా దొరికే పోషకాహారంలో పాలను మించినవి లేవు. ఐదు దశాబ్దాల కిందట భారత్లో పాలకు లోటు ఉండేది. పాలను, పాలపొడిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఉండేవి. వర్ఘీస్ కురియన్ 1970లో చేపట్టిన ‘శ్వేత విప్లవం’ అనతికాలంలోనే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా మన దేశం పాల ఉత్పాదనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్య«ధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.

పాల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలో నిలుస్తున్నా, పాల తలసరి వినియోగంలో మాత్రం మొదటి పది స్థానాలలో లేకపోవడం గమనార్హం. అత్యధిక జనాభా, పేదరికం, పాలకు బదులుగా పెరుగు, మజ్జిగ వంటి ఉత్పాదనల వినియోగం పట్ల ప్రజల అభిరుచి తదితర కారణాల వల్ల తలసరి పాల వినియోగంలో భారత్ వెనుకబడి ఉంటోందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. పాల తలసరి వినియోగంలో మొదటి పది దేశాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం.
Tags : 1