Breaking News

మానవత్వమే దైవత్వం

Published on Tue, 08/19/2025 - 10:42

మానవ సేవే మాధవ సేవ అంటారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు,అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితులలో మానవ సేవలో ధన్యులయిన వారిని స్మరించుకోవడం కోసం 2009 నుండి ఆగస్టు 19 నాడు ‘ప్రపంచ మానవత్వ దినోత్సవా’ (world humanitarian day )న్ని జరుపుకొంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ తేదీనే ఎంచుకోడానికి కారణం... బ్రెజిల్‌ దేశానికి చెందిన సెర్గియోడిమెల్లో. ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాల పాటూ ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) మానవతా వాద సహాయ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేశారు. చాలా దేశాల్లో యుద్ధాల మధ్య యూఎన్‌ఓ సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఆయన... 2003 ఆగస్టు 19న ఇరాక్‌లోని ఒక బాంబు పేలుడులో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి యూఎన్‌ఓ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 

ఈ ఏడాది ‘ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం, స్థానిక సమాజాలకు సాధికారత కల్పించడం’ అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇజ్రాయెల్‌– పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలో వందలాది మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నిత్యం అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్రికా ఖండంలోని సోమాలియా వంటి దేశాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మానవత్వంతో, సహనంతో వ్యవహరించాలి. దయనీయ స్థితిలో కూరుకుపోయిన వారికి సహాయం అందించి ఆదుకోవాలి. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మ కాలు, విభిన్న తాత్విక దృక్పథాలు ఉంటాయి. వాటిమధ్య సహజీవన సౌగంధాన్ని సాధించినప్పుడే శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. సహనం సామా జిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్ల కల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి.

ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు

– ఎం. రాం ప్రదీప్‌ ‘ జన విజ్ఞాన వేదిక, తిరువూరు

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి