Breaking News

World Health Day 2025 : కొన్నిముఖ్యమైన విషయాలు, గణాంకాలు

Published on Mon, 04/07/2025 - 18:02

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో గర్భస్థ శిశువులు, ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ఈ మరణాల రేటు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే కనిపిస్తోంది.   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం  (World Health Day) అందరికీ సమానమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను నిర్ధారించాల్సిన అత్యవసర అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హెల్దీ బిగినింగ్స్‌ అండ్‌ హోప్‌ ఫుల్‌ ఫ్యూచర్స్ (“Healthy Beginnings, Hopeful Futures”)‌ అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించింది. ఈ విషయంలో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యం కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ఆరోగ్యకరమైన శిశువు బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారి భవిష్యత్తు కూడా డా ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ, బాల్యం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి, పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ జనన బరువు, సరైన ప్రసూతి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు లింగ అసమానతలు వంటి సవాళ్లను  అధిగమించడం చాలా కీలకం.

ప్రసూతి పోషకాహార ప్రాముఖ్యత, రక్తహీనత, బరువు తక్కుతో సంభవించే శిశు  జననాలను తగ్గింసే ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు
ప్రసూతి మరణాలు: గర్భధారణ లేదా ప్రసవ సమస్యల కారణంగా సంవత్సరానికి సుమారు 3లక్షల మంది మహిళలు మరణిస్తున్నారు.

నవజాత శిశు మరణాలు: ప్రతి సంవత్సరం 2 మిలియన్లకు పైగా శిశువులు వారి మొదటి నెలలోనే మరణిస్తున్నారు.

ప్రసవాలు: సంవత్సరానికి సుమారు 2 మిలియన్ల ప్రసవాలు జరుగుతున్నాయి.

మరణాలు : దురదృష్టవశాత్తు, ప్రతి 7 సెకనకు  పుట్టకముందే లేదా పుట్టిన తరువాత  ఒక శిశు మరణం సంభవిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య లక్ష్యాలు: 2030 నాటికి ప్రసూతి మనుగడ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది కానీ ఈ  బాటలో 5 దేశాలలో 4 దేశాలు లేకపోవడం గమనార్హం.

మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య పరిస్థితులు మాతా మరియు నవజాత శిశువుల ఆరోగ్యానికి గణనీయమైన ఆందోళన కలిగిస్తాయి.

నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్: ఈ వ్యాధులు మాతాశిశు ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

కుటుంబ నియంత్రణ: ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కుటుంబ నియంత్రణ సేవల అందుబాటులోకి రావడం చాలా కీలకం.

ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత: మరణాల రేటును తగ్గించడానికి జననానికి ముందు,  ప్రసవ సమయంలోనూ , ఆ తరువాత అధిక-నాణ్యమైన సంరక్షణ అవసరం.

గ్లోబల్ క్యాంపెయిన్స్: తల్లీ బిడ్డలశిశువులకు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ప్రపంచ దేశాల ప్రయత్నాల ప్రాముఖ్యతను డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెప్పింది

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)