Breaking News

World Environment Day 2025: పర్యావరణాన్ని కాపాడాలి!

Published on Thu, 06/05/2025 - 12:07

మన చుట్టూ ఉన్న సహజ, మానవ నిర్మిత అంశాలన్నీ కలిపి ఒక జీవి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసే వాతా వరణమే పర్యావ రణం. నేల, నీరు, గాలి మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకాలు. ఈ మూడూ ఇప్పుడు కలుషితం అవుతూ ఉండడం భూమి మీద ఉన్న సకల జీవరాశికీ ప్రాణసంకటం అయ్యింది. పర్యావరణంలోకి విడుదల అవు తున్న ఇతర కాలుష్య కారకాలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణ వ్యవస్థల్ని మరింతగా ధ్వంసం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ కాలు ష్యాన్ని సమర్థంగా ఎదు ర్కోడానికి ప్రపంచ దేశా లన్నీ ‘ప్లాస్టిక్‌ కాలు ష్యాన్ని ఎదుర్కొందాం’ అనే నినాదంతో 2025 సంవత్సరపు పర్యావరణ దినోత్సవాన్ని జూన్‌ 5న జరుపుకోవాలని ఐక్య రాజ్య సమితి కోరింది. 

వాతావరణంలోకి కార్బన్‌ డయాక్సైడ్‌ చేరడంవల్ల వాతావరణం వేడెక్కి దాని ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. వేడి వాతావరణంలో కాలుష్య కారకాలు, పుప్పొడిరేణువుల సంచారం బాగా పెరుగుతుంది. కాలుష్యం పెరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కంటి జబ్బులు కూడా వస్తున్నాయి. ఈ వేడికి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఉప్పె నలు వస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థలో మరొక సమస్య ఆమ్లవర్షాలు. నేల మీద విడు దలై ఆకాశాన్ని చేరుతున్న కలుషిత గాలుల్లో సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ఉన్నాయి. ఇవి వర్షపు జల్లులతో కలసి ఆమ్లవర్షాలుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు నేలపై పడేసరికి ఆ నేలలు సేద్యానికి యోగ్యం కాకుండా పోతున్నాయి. కప్ప వంటి ఉభయచరాలు చిన్న చిన్న గుంటల్లో గుడ్లు పెడతాయి. అక్కడికి ఆమ్లవర్షం చేరితే గుడ్లు నాశనమై పిల్లలు పుట్టవు. నీటిలో నివసించే చేపలు, రకరకాల కీటకాలు, ఈ ఆమ్లవర్షాలకు బతక లేవు. ఈ వర్షం ఆహారపు గొలుసును తునా తునకలు చేస్తుంది. రవాణా కోసం మోటారు సైకిళ్ళకు బదు లుగా ప్రజారవాణా సదుపాయాన్ని వినియో గించుకోవాలి. నడక, సైకిళ్ల వాడకం మంచిది. రక్షిత నీటి సరఫరాకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. దోమలను నియంత్రించే విధానాలపై దృష్టి పెట్టాలి. నీరు పారే ప్రాంతాలలో ఎటు వంటి మలినాలు లేకుండా చూడాలి. 

ఇదీ చదవండి: చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్‌ ఎట్రాక్షన్

పర్యావరణంలోకి చేరే వ్యర్థా లలో అధిక భాగం ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలే! ఏటా విడుదల వుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థా లలో 46 శాతం వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తుంటే, దాదాపు 23 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సము ద్రాలు, నదులను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ పదార్థాలు నేలలో కలసిపోవు. నేలను నాశనం చేస్తాయి. సాధ్యమైనంతవరకు రీసై కిల్‌ చేయడానికి వీలున్న ప్లాస్టిక్‌ వస్తువు లనే వాడాలి. అలా కానివాటి వాడకాన్ని నిషేధించాలి. ఇప్పుడు శబ్దకాలుష్యం ఎక్కువ అయ్యింది. ఈ కాలుష్యాన్ని హరించేందుకు చెట్ల పెంపకం చేపట్టాలి. రైతులు పంటల దిగుబడి పెరిగేందుకు కృత్రిమ రసాయ నాలను ఎరువులుగా వాడే బదులు సేంద్రియ ఎరువులు వాడాలి. మరుగుదొడ్ల వాడకం పెరగాలి. 

డా. సి.వి. సర్వేశ్వర శర్మ
పాపులర్‌ సైన్స్‌ రచయిత
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)