Breaking News

వసివాడుతున్న బాల్యం..

Published on Thu, 06/12/2025 - 12:07

అభంశుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా  లెక్కల్లోకి రాని వారెందరో..మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు బడి ముఖం చూడని వారున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పిల్ల లను పనిలో పెట్టేలా ప్రోత్సహిస్తుండడంతో..వ్యాపార వర్గాల వారు కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పనిని బాలలతో చేయిస్తున్నారు. కొందరు బాలలైతే ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనులు చేస్తూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నేడు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం సందర్భంగా.. బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల వెతలపై ప్రత్యేక కథనం.. 

విజయనగరం గంటస్తంభం: 
చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.

భవిష్యత్‌ అంధకారం.. 
బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్‌లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు.  

ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం 
ఏటా జూన్‌ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకారి్మక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. 

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.

బాలలను పనిలో పెడితే...కఠిన చర్యలు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్‌ ఫ్రీ నంబర్లకు  ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. 

ఈ ఏడాది జూన్‌ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్‌ ముస్కాన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్‌ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకారి్మకుల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్‌ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. 
ఎస్‌డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్‌ 

(చదవండి: ఆటో డ్రైవర్‌ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)