Breaking News

చల్‌ మేరే దిల్‌..! క్రేజ్‌ సంతరించుకుంటున్న సైకిల్‌

Published on Tue, 06/03/2025 - 09:48

ఇప్పుడంటే మోటారు సైకిల్, కార్లు సర్వసాధారణం అయ్యాయిగాని.. ఒక జనరేషన్‌ వెనక్కి వెళితే సైకిల్‌ అనేది స్టేటస్‌ సింబల్‌గా ఉండేది. ఊర్లో అక్కడక్కడా కనిపించేవి. పెళ్లిళ్లలో మగ పెళ్లివారు సైకిల్‌ బహుమానంగా ఇవ్వాల్సిందేనని అడిగి మరీ తీసుకునేవారు. ఆ పరిస్థితుల నుంచి మధ్యలో కొంత కాలం విరామం వచ్చింది. ప్రస్తుతం మళ్లీ సైకిల్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. ఆరోగ్యం, శారీరక వ్యాయామం, ఒత్తిడి నుంచి రిలాక్సేషన్, కాలుష్య నివారణ, పెట్రోల్‌ వినియోగం తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించిన పట్టణ యువత తిరిగి సైక్లింగ్‌ వైపు మొగ్గుచూపుతోంది. జూన్‌ 3 ప్రపంచ సైక్లింగ్‌ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. 

ఆకారంలో మార్పు.. ధరల్లో వ్యత్యాసం..
సైకిల్‌ తయారు చేసిన తొలినాళ్లలో దాని ఆకారం ఇప్పుడున్నట్లు లేదు. ముందు చక్రం పెద్దదిగాను, వెనుక చక్రం చిన్నదిగాను ఉండేది. కాలక్రమేణా దాని రూపం మారుతూ వచ్చింది. సైకిల్‌ ధర అప్పట్లో రూ.వందల్లో ఉండేది. ప్రస్తుతం మోడల్‌ బట్టి వేలల్లో అమ్మకాలు చేస్తున్నారు. 1980లో సుమారు రూ.500 నుంచి రూ.800 మధ్యలో లభించేది. 

అది కాస్త 2000 సంవత్సరం వచ్చే సరికి సుమారుగా రూ.3 వేల నుంచి రూ.4500 వరకూ పెరిగింది. ప్రస్తుతం పాత తరం వినియోగించే మోడల్స్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. 1950 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు సైకిల్‌ విరివిగా వినియోగించేవారు. హెర్క్యులస్, హీరో, అట్లాస్‌ వంటి సైకిల్‌ కంపెనీలు భారత దేశంలో గుర్తింపు పొందిన కంపెనీలు. 

దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు దీని వినియోగానికి విరామం ఏర్పడింది. అనంతరం కొత్త మోడళ్ల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులు తొక్కే సైకిల్‌ ప్రారంభ ధర రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు సుమారు రూ.3 వేల నుంచి రూ.పది వేలకుపైబడిన ధరల్లో అమ్ముడుపోతున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, సైక్లింగ్‌ చేసేవాళ్లు, ఇలా వేర్వేరు కేటగిరీలు, విభిన్నమైన మోడళ్లలో సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.  

ఎన్నో ఉపయోగాలు.. 
సైకిల్‌ తొక్కువడం వల్ల ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగానూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు అన్నిటికంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాన్సర్, మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, దీర్ఘకాలిక రోగాలకు సైక్లింగ్‌తో చెక్‌ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

నగరవాసులు బిజీ లైఫ్‌లో ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు, ఇతర రంగాల వారికి తమతమ పనుల్లో శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో సైక్లింగ్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మోటారు సైకిళ్లు, కార్లకు బదులుగా సైకిళ్లను వినియోగిస్తే కాలుష్య నివారణతో పాటు, ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. నగరంలో సైక్లింగ్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఓఆర్‌ఆర్, కేబీఆర్‌ పార్క్, తదితర ప్రదేశాల్లో సైకిల్‌ ట్రాక్స్‌ నిర్మించింది.  

దేశంలో సైకిల్‌ చరిత్ర ఇలా.. 
భారత దేశంలో 1890ల్లో యూరోపియన్‌ దేశస్తులు సైకిల్‌ తొక్కడం ప్రారంభించారు. ఉన్నత, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు స్టేటస్‌ సింబల్‌గా వినియోగించేవారు. 1920–1935 మధ్య కాలంలో ప్రపంచ సైకిల్‌ యాత్రలు ప్రారంభమ్యాయి. బ్రిటిష్‌, నవాబుల పరిపాలనలో సమాచార సరఫరా, తపాలా, పోలీసులు, సైన్యం సైతం వివిధ అవసరాలకు సైకిళ్లనే వినియోగించేవారు. తొలి నాళ్లలో కార్మికులు హెర్క్యులస్‌ సైకిళ్లు వినియోగిస్తే.. ఉన్నత వర్గాలు రాలీ, జేమ్స్‌ సైకిళ్లను వినియోగించేవారట. 

ఫిట్నెస్‌ మోటివేట్‌ అవుతుంది.. 
సైక్లింగ్‌ చేయడం వల్ల ఫిట్నెస్‌ మోటివేట్‌ అవుతుంది. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులంతా కలసి సైక్లింగ్‌ చేస్తాం. ఫలితంగా రొటీన్‌ లైఫ్‌కు భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ లభిస్తుంది. కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలను నియంత్రించవచ్చు. 
– నేహ, మణికొండ  

పర్సనల్‌ టైం సైక్లింగ్‌.. 
తొమ్మిదేళ్ల నుంచి సైక్లింగ్‌ చేస్తున్నాను. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకూ సైక్లింగ్‌ చేస్తాం. ఇంటికి చేరుకుని కుటుంబం, పిల్లలు ఇతర పనుల్లో బిజీ అయిపోతాం. నాకంటూ దొరికే పర్సనల్‌ టైం సైక్లింగ్‌. ఔట్‌ సైడ్‌ నేచర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. 70 కిలోమీటర్ల వరకూ వెళ్తుంటాను. 500 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేయాలన్నది నా లక్ష్యం. 35 మంది మహిళలు కలిసి వెళ్తుంటాం. అంతా మంచి మిత్రులైపోయాం.        
 – వందన లోకేష్‌ యుగంధర్, మణికొండ  

(చదవండి: womens safety: ఆపదలో అండగా...!ఈ స్మార్ట్‌ డివైజ్‌తో భద్రంగా ఉండొచ్చు..)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)