Breaking News

బ్లాక్‌ ఫారెస్ట్‌.. స్వీట్‌ లవర్స్‌కి గ్రేట్‌ టేస్ట్‌!

Published on Mon, 07/06/2026 - 08:16

ప్రతీ ట్రిప్‌ అడ్వెంచర్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా? ఎందుకంటే కొన్ని ప్రదేశాలు సైలెంట్‌గా మనసును రిఫ్రెష్‌ చేస్తాయి. ‘బ్లాక్‌ ఫారెస్ట్‌’ అలాంటి ఒక ప్రదేశమే. మొదటిసారి  యూరోప్‌ విజిట్‌ చేసే వాళ్లకు కూడా ఈ ప్రదేశం కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఫ్రెష్‌ ఎయిర్, గ్రీన్‌ వ్యూస్, ప్రశాంతమైన రహదారులు కలిసి ఒక రిలాక్స్‌డ్‌ ఫీలింగ్‌ ఇస్తాయి. ఇక్కడ సమయం నెమ్మదిగా గడుస్తున్న అనుభూతి కలుగుతుంది.

అడవి మధ్య గ్రామాలు చాలా నీట్‌గా ఉంటాయి. వుడెన్‌ హౌజెస్, ఫ్లవర్‌ బాల్కనీలు, చిన్న స్ట్రీట్స్‌ అన్నీ పోస్ట్‌కార్డులా కనిపిస్తాయి. మార్నింగ్‌ మిస్ట్‌ చెట్ల మధ్య పడితే వాతావరణం ఇంకా కామ్‌గా ఉంటుంది. వాకింగ్‌ చేస్తూ నేచర్‌ సౌండ్స్‌ వింటుంటే సిటీ నాయిస్‌ సులభంగా మరిచిపోతాం. ప్రతీ కార్నర్‌లో సింపుల్‌ బ్యూటీ కనిపిస్తుంది.

సందర్శనీయ ప్రదేశాలు: ట్రిబెర్గ్‌ జల΄ాతాల దగ్గర నీటి శబ్దాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. టిటిసీ లేక్‌ పక్కన ఈవినింగ్‌ వాక్‌ ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. బేడెన్‌ బేడెన్‌ స్ట్రీట్స్‌ వైబ్‌ ఫీల్‌ అవ్వాలంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్లాల్సిందే అనిపిస్తుంది.

ఏం తినాలి?
‘బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌’ స్వీట్‌ లవర్స్‌కి మెమోరెబుల్‌ టేస్ట్‌ ఇస్తుంది. ఫ్లామ్‌కుచెన్‌ క్రిస్పీ బేస్‌తో లైట్‌గా ఎంజాయ్‌ చేయవచ్చు. ట్రెడిషనల్‌ జర్మన్‌ సాసేజ్‌లను వార్మ్‌ బ్రెడ్‌తో ఆస్వాదిస్తే లోకల్‌ ఫ్లేవర్‌ కంప్లీట్‌గా ఫీల్‌ అవుతుంది. సింపుల్‌ ఫుడ్‌ అయినా శాటిస్‌ఫైయింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తుంది.

ఎప్పుడు వెళ్లాలి?
మే నుంచి అక్టోబర్‌ వరకు క్లైమేట్‌ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆటమ్‌లో రంగురంగుల చెట్లు ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఈ సమయంలో వెళ్తే రోడ్లు చాలా క్లీన్‌ గా ఉంటాయి. స్థానికులు చాలా స్నేహభావంతో పలకరిస్తారు. స్లో ట్రావెల్‌ని ఎంజాయ్‌ చేయడానికి ఇది పర్ఫెక్ట్‌ వాతావరణం అని చెప్పవచ్చు.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ లేక స్టుట్‌గార్డ్‌ కి కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో సుమారు 12 నుంచి 15 గంటల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి ట్రెయిన్‌ లేక కార్‌ జర్నీతో బ్లాక్‌ ఫారెస్ట్‌ రీచ్‌ అవ్వడం ఈజీ. సీనిక్‌ రూట్‌ జర్నీని ఇంకా ఎంజాయబుల్‌గా మార్చేస్తుంది. ట్రిప్‌ అయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్‌ ఎక్కువగా గుర్తొస్తాయి. నేచర్‌తో స్పెండ్‌ చేసిన క్వైట్‌ మూమెంట్స్‌ హార్ట్‌లో లాంగ్‌ టైమ్‌ ఉంటాయి. బ్లాక్‌ ఫారెస్ట్‌ విజిట్‌ సింపుల్‌గా జర్నీ అయినా అనుభూతి మాత్రం లైఫ్‌ టైమ్‌ మిగిలిపోతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)