Breaking News

సీతమ్మ నోట స్త్రీ కష్టం

Published on Thu, 02/06/2025 - 01:08

మహిళల శ్రమశక్తికి సాక్ష్యాలు, తూనికరాళ్లు అక్కర్లేదు. స్త్రీ శ్రమశక్తి అనేది నిత్యం కళ్ల ముందు కనిపించేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రమ అంటేనే స్త్రీ. అయినా సరే, ఎప్పటికప్పుడు మహిళలు తమను తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది.

 ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మహిళల కష్టం గురించి చేసిన వ్యాఖ్యలుప్రా«ధాన్యతను సంతరించుకున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘గుర్తింపు పొందడానికి మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. స్కూల్, కాలేజీ, బోర్డ్, ఆర్మీ, మీడియా... ఇలా ఎక్కడైనా సరే గుర్తింపు రావాలంటే పురుషుల కంటే మూడురెట్లు తమను తాము నిరూపించుకోవాలి. ఇది అన్ని చోట్లా ఉంది’ అంటున్నారు నిర్మలమ్మ.

‘లైఫ్‌ ఈజ్‌ అన్‌ ఫెయిర్‌’ అంటూనే అంతర్గత శక్తి ని పెంపొందించుకోవడం గురించి నొక్కి చెబుతున్నారు. అన్యాయాలు జీవితంలో ఒక భాగమని, వాటిని అధిగమించడానికి అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడం కీలకం అంటున్నారు నిర్మలా సీతారామన్‌.

‘కంపెనీ బోర్డులలో మహిళల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కంపెనీ బోర్డుల్లో ఉండడానికి తాము అర్హులమని ఇప్పటికీ నిరూపించుకోవాలా!’ అని ప్రశ్నిస్తున్న సీతారామన్‌– ‘మహిళలు తమను తాము నిరూపించుకున్నారు. తమదైన గుర్తింపు పొందారు’ అంటూ చరిత్రను గుర్తు తెచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)