Breaking News

అగ్రస్థానానికి ఆమడ దూరంలో...

Published on Thu, 03/12/2026 - 07:59

విద్య, శాస్త్ర సాంకేతికత వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నప్పటికీ కంపెనీల అగ్రస్థానాల్లో మాత్రం వారి ప్రాతినిధ్యం నత్తనడక నడుస్తోందనే చెప్పాలి. వరల్డ్‌  ఎకనామిక్‌ ఫోరమ్‌ –2025తో పాటు, ఇటీవల నిర్వహించిన ‘ఆన్‌’ సర్వే నివేదికలలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నైపుణ్యం ఉన్నప్పటికీ సంస్థల్లోని పక్షపాత ధోరణి వల్లే మహిళలు టాప్‌ రోల్స్‌కి చేరుకోలేకపోతున్నారని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి.

 వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌– 2025, మెకిన్సే, లింక్డ్‌ ఇన్‌ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సిద్ధించాలంటే మరో 123 ఏళ్లు పడుతుందని అంచనా.  

 కంపెనీల్లో ప్రతి 100 మందిలో 81 మందికి పురుషులకు మేనేజర్‌గా ప్రమోషన్‌ వస్తుంటే, మహిళల్లో కేవలం మాత్రమే 19 మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతోంది. దీనినే నిపుణులు ‘బ్రోకెన్‌ రంగ్‌’ (విరిగిన నిచ్చెన మెట్టు) అని పిలుస్తున్నారు. ్రపారంభ దశలోనే ఎదురయ్యే ఈ అడ్డంకి వల్ల ఉన్నతస్థాయికి వెళ్లే మహిళల సంఖ్య తగ్గిపోతోంది.

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ సంస్థల అత్యున్నత పదవుల్లో (సీఈవో, సీఎఫ్‌వో) మహిళల వాటా కేవలం 29% మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇందులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.

 ‘ఆన్‌’ సర్వే ప్రకారం 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి, కేవలం 20% మంది మహిళలు మాత్రమే (ఐదుగురిలో ఒకరు) ఉన్నత స్థాయి పదవులకు చేరుకోగలుగుతున్నారు. అదే పురుషులలో దాదాపు సగం మంది అంటే 50% మంది ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారు.


 కెరీర్‌ మొదట్లో మహిళల భాగస్వామ్యం 48% ఉండగా, సీనియర్‌ స్థాయికి వచ్చేసరికి అది 27 శాతానికి పడిపోతోంది.

 వేతన సమానత్వానికి వస్తే పురుషుడు 100 రూపాయలు సంపాదిస్తుంటే, అదే పనికి మహిళ 84 రూపాయలు మాత్రమే పోందుతోంది. అంటే ప్రతి వంద రూపాయలలో మహిళ 16 రూపాయలను నష్టపోతోంది. ఈ వ్యత్యాసం కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. వారి ఆర్థిక స్వేచ్ఛను,  పోందుపును కూడా ప్రభావితం చేస్తోంది. 


2 ఇక వేతన వ్యత్యాసానికి వస్తే... ఒకసారి బ్రేక్‌ తీసుకున్న తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు, అదే అనుభవం ఉన్న పురుషుల కంటే మహిళలు 20–30% తక్కువ వేతనాన్ని పోందుతున్నారు.

2 ప్రపంచవ్యాప్తంగా కేవలం 27 దేశాలకు మాత్రమే మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు.

2 భారత కార్పొరేట్‌ రంగంలో బోర్డు మెంబర్లలో మహిళల వాటా కేవలం 20% మాత్రమే.  కన్‌స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో నాయకత్వ పదవుల్లో మహిళలు 12 నుంచి 15 శాతానికి మించి లేరు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌  రంగంలో పురుషులతో పోలిస్తే మహిళలకు శిక్షణ, ్రపోత్సాహం 12% తక్కువగా అందుతోంది.


2 మహిళల్లో దాదాపు 70 శాతం మంది తమ పిల్లల పెంపకం, కుటుంబ అవసరాల కోసం కెరీర్‌లో విరామం తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.  ఈ విరామం వల్ల వారి కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోవడమే కాకుండా, వేతనాల్లోనూ కోత తప్పట్లేదు.


2 కంపెనీల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో మహిళలు (60%) కనిపిస్తున్నప్పటికీ, కీలక విభాగాల్లో మహిళల ్రపాతినిధ్యం 15% కంటే తక్కువ.
2 అంతర్గత ప్రమోషన్ల విషయంలో వివక్ష ఎదురవడంతో, మహిళలు తమ ఎదుగుదల కోసం పురుషుల కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు మారాల్సి వస్తోంది.

ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, పని ప్రదేశాల్లో మారాల్సిన సంస్కృతికి నిదర్శనం. కంపెనీలు ఫ్లెక్సిబుల్‌ పని గంటలు, సమాన వేతనం, కీలక విభాగాల్లో మహిళలకు ్రపాధాన్యత ఇచ్చినప్పుడే ఈ వ్యత్యాసం తగ్గుతుంది.
 

#

Tags : 1

Videos

బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్

భార్య వేధింపులకు మరో భర్త బలి

ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా.. 100 షేర్లకు 1000 షేర్లు ఫ్రీ..

మెగా పారడైస్ పై బిగ్ అప్ డేట్.. ఎప్పుడు ప్రారంభం?

పాల కోసం ఎగబడ్డ జనం

హైదరాబాద్ లో గ్యాస్ టెన్షన్.. భారీగా పెరిగిన బుకింగ్స్

పచ్చ మీడియా సైలెంట్.. బయటపడ్డ పెంచలయ్య సిఫార్స్ పత్రం

అమెరికాలో కాల్పుల కలకలం

యుద్ధం ముగించాలి.. లేదా..! ట్రంప్ కు రాండ్ పాల్ హెచ్చరిక

జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది.. YSRCP పేరు వింటేనే బాబుకు గజ గజ

Photos

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)