Breaking News

మహిళాశక్తి శిక్షణ : సత్తా చాటిన మహిళలు

Published on Tue, 12/24/2024 - 15:20

చికెన్‌ బిర్యాని, సాధారణ బిర్యాని, బేసిక్‌ గ్రేవీస్, తెలంగాణ స్నాక్స్, రైతా, వెజ్‌ దమ్‌ బిర్యాని, చికెన్‌ కర్రీ, మిర్చి మసాల, రకరకాల అన్నం తయారీ, టీ, విభిన్న రకాల కాఫీ, సావరీ, వంటి వివిధ మెనూలను అదరగొట్టారు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వాహకులు. చెఫ్‌లు మహేష్‌ నిథమ్‌ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్, ప్రముఖ చెఫ్‌ డాక్టర్‌ ఎంకె గణేష్, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ మిసెల్లీ జే ఫ్రాన్సిస్‌ పర్యవేక్షణలో ఐదో బ్యాచ్‌లో 28 మంది మహిళలకు వంటల తయారీ, క్యాంటీన్‌ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. -రాయదుర్గం 

పరిశుభ్రమైన వాతావరణంలో, స్వచ్ఛమైన, నాణ్యమైన వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి అందించేలా ఏర్పాట్లు చేయడం, దీనిపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం విశేషమని శిక్షణలో పాల్గొన్న మహిళలు అన్నారు. పదిరోజుల పాటు అందించిన శిక్షణలో భాగంగా చివరి రోజైన సోమవారం మహిళలు నేర్చుకున్న వంటకాలన్నీ స్వయంగా తయారుచేసిన ప్రదర్శించారు. ఈ వంటకాలను నిథమ్, సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (ఎస్‌ఈఆర్‌పీ), పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈఆర్‌పీ డైరెక్టర్‌ డబ్ల్యూ జాన్సన్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రావణ్, నిథమ్‌ అధికారులు శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించారు.  

ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.. 
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికే క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎస్‌ఈఆర్‌పీ డైరెక్టర్‌ డబ్ల్యూ జాన్సన్‌ తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా మాట్లాడుతూ క్యాంటిన్ల నిర్వహణ ద్వారా వారు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నారని గుర్తు చేశారు. ఆహార పదార్థాల తయారీపై ప్రత్యేక శిక్షణలో  నిథమ్‌కు మంచి గుర్తింపు ఉందని, నిర్వాహకులకు ఐదు విడతల వారిగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సెర్ప్‌ సీఈఓ డీ దివ్య, పర్యాటక శాఖ, నిథమ్‌ డైరెక్టర్‌ జెడ్, హన్మంత్‌ ఎప్పటికప్పుడు శిక్షణను పర్యవేక్షించారని గుర్తుచేశారు. సెర్ప్, నిథమ్, పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: స్టూడెంట్స్‌తో మహిళా ప్రొఫసర్‌ క్రేజీ డ్యాన్స్‌ :​ వీడియో హల్‌చల్‌


 

 

 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)