Breaking News

డబ్బుల కోసం ఇంత కక్కుర్తా? స్వయానా అన్ననే.. వైరల్‌ స్టోరీ

Published on Wed, 03/20/2024 - 14:38

పెళ్లి అంటే  నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు.  ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో  ఈ ఉదంతం చోటు చేసుకుంది.

2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం  కార్యక్రమాన్ని  చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు.

అయితే మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని   ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది.

అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా  విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు.

కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు,  తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్‌ అయ్యాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)