Breaking News

వ్యవసాయ నేపథ్యం.. కానీ రూ. 52 లక్షల జాబ్‌ ఆఫర్‌ని కొట్టేసింది..!

Published on Mon, 02/03/2025 - 15:30

కొందరూ కార్పొరేట్‌ స్కూల్స్‌లో చదవకపోయినా వారికి ధీటుగా కళ్లు చెదిరే రేంజ్‌లో జాబ్‌ ఆఫర్‌లు అందుకుంటారు. కనీసం పట్టణ ప్రాంత నేపథ్యం కాకపోయినా అలవోకగా అందివచ్చిన ప్రతి అవకాశంలోనూ తమ ప్రతిభా పాటవాలు చాటుకుంటారు. ఎవ్వరూ ఊహించని రీతీలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వాళ్లు నోరువిప్పి చెబితేగానీ తెలియదు వారు అంతటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చారా అని... !. అలాంటి కోవకు చెందిందే అశ్రిత. ఆమెకు డీఆర్‌డీవో, ఇస్రో వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు జాబ్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే వాటన్నింటిని వద్దనుకుని ఏకంగా అమెరికా మల్టీనేషనల్‌ కంపెనీలో మంచి వేతనంతో కూడిన జాబ్‌ ఆఫర్‌ని అందుకుని  శెభాష్‌ అనుపించుకుంది. ఎవరా అశ్రిత అంటే..

తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి అశ్రిత. కుటుంబం జీవనోపాధి వ్యవసాయం. చిన్ననాటి నుంచి సాధారణంగానే చదివేది. ఇంటర్‌ పూర్తి అయ్యిన వెంటనే ఎలాంటి కెరీర్‌ ఎంచుకోవాలనే ఆలోచనలు కూడా పెద్దగా ఏమిలేవు. అందిరిలా బీటెక్‌ చేద్దాం అనుకుంది అంతే. అలా జ్యోతిష్మతి ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బిటెక్‌ డిగ్రీ పూర్తి చేసింది. అయితే అశ్రితకి అక్కడ నుంచి ఆమె కెరీర్‌పై సరైన స్పష్టత ఏర్పడింది. 

అందరూ సాఫ్ట్‌వేర్ వైపు మళ్లితే ఆమె మాత్రం హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం సంపాదించాలనుకుని అటువైపుగా కెరీర్‌ని ఎంచుకుంది. ఆ నేపథ్యంలో ఎంటెక్‌ చేయడం కోసం గేట్‌కి ప్రిపేరయ్యింది. అయితే తొలి ప్రయత్నంలో మూడువేల ర్యాంకు రావడంతో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జాయిన్‌ అవకాశం కోల్పోయింది. దీంతో ఆమె మరోసారి గేట్‌కి ప్రిపేరవ్వాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. 

అలా 2022లో ఆల్‌ ఇండియా 36 ర్యాంకు సాధించింది. ఈ విజయంతో ఆమెకు ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్‌, ఎన్‌పీసీఐఎల్‌ వంటి అగ్ర సంస్థల్లో ఉద్యోగ ఆఫర్‌ని అందుకుంది. అయితే వాటన్నింటిని కాదనుకుని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎంటెక్‌ పూర్తి చేయడం వైపే మొగ్గు చూపింది. 

ఆ తర్వాత అమెరికన్‌ మల్టీనేషనల్‌ కంపెనీ ఎన్‌వీఐడీఐఏ(NVIDIA)లో రూ. 52 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజ్‌తో ఉద్యోగాన్ని పొందింది. వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురు అశ్రిత అసాధారణమైన విజయం సాధించిందంటూ మురిసిపోయారు.

(చదవండి: 'బయోనిక్‌ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!)

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)