Breaking News

మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..

Published on Thu, 12/28/2023 - 16:49

ఒక్కొసారి చీమలు, మిడతలు, సాలీడు వంటివి చెవిలోకి ఎలా వెళ్తాయో తెలియదు గానీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఫేస్‌చేసే నరకం అంతా ఇంత కాదు. అచ్చం అలానే ఇక్కడో మహిళ కూడా అదే సమస్యే ఎదుర్కొంది. అయితే ఏ కీటకం అయిన మనిషి శరీరంలోకి వెళ్లితే చనిపోవడం ఖాయం. కానీ ఈ సాలీడు మహిళ చెవిలోనే ఏకంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడంతో నరకయాతన చవిచూసింది. చివరికీ పరిస్థితి క్రిటికల్‌ అయ్యి ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషాదకర ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌కి చెందిన లూసీ వైల్డ్‌ అనే మహిళకి ఒక రోజు ఉన్నటుండి చెవిలో వింత శబ్దాలు రావడం ఒకటే నొప్పిగా అనిపించింది. ఇంక లాభం లేదనుకుని తన భర్త సాయంతో మైక్రోస్కోపిక్‌ కెమెరాతో ఏం ఉందో తెలుసుకుంటారు. లోపల సాలీడు ఉన్నట్లు అర్థమై భయంతో కేకలు పెట్టింది. అయితే ఆమె భాగస్వామి వేడి నూనె వంటివి వేసి తీయాలనుకుంటాడు.

అయితే అవేమీ తన బాధను తగ్గించకపోగా చెవి నుంచి రక్తస్రావం అవ్వడం మొదలైంది. ఇక దీంతో ఈఎన్‌టీ ఆస్పత్రికి హుటాహుటినా ఆ మహిళలను తరలిస్తారు. అక్కడ వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆ సాలీడు, దాని గూడుని తొలగించి యాంటి బయోటిక్‌ మందులతో ఇన్ఫెక్షన్‌లు తగ్గిస్తారు. ఇప్పుడు లూసీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అలా సొంత వైద్యం తీసుకోవడంతో ఇంకా చెవిలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్లే అనిపిస్తోంది లూసీకి. 

ఇలాంటప్పుడూ ఏం చెయ్యాలంటే..

  • ఇలా చెవిలో ఏదైన కీటకం దూరినట్లయితే వెంటనే చెవిని ఒకవైపుకి వంచి ఉంచండి. అయినప్పటికీ అది కొరుకుతూ ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లిపోండి. 
  • ఆలస్యం చేశారో ఇన్ఫెక్షన్‌కు దారితీసి చీము వంటి ద్రవాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. 
  • మీ సొంత వైద్యంతో చెత్త పరికరాలతో తీసేందుకు యత్నిస్తే ఈయర్‌ డ్రమ్‌కి సమస్య ఏర్పడవచ్చు
  • ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లి కీటకాన్ని తీయించుకున్నా కూడా వినికిడి శక్తి కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. 
  • అలాగే క్రిమి పూర్తిగా తొలగించబడలేనట్లు అసౌకర్యంగా ఉన్న మళ్లీ వైద్యుడిని సంప్రదించండి.
  • ఇలాంటప్పుడూ సొంత ప్రయోగాల కంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం

(చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!)

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)