Breaking News

Winter: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఆహారం తిన్న వెంటనే స్నానం చేయొద్దా?

Published on Tue, 12/06/2022 - 10:06

Winter Care Tips: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఇదేం ప్రశ్న లేదా పనికి మాలిన సందేహం? ఎవరికి ఎలా ఇష్టం అయితే అలా స్నానం చేస్తారు అని ముఖం చిట్లించకండి. ఎందుకంటే స్నానానికి ఎప్పుడూ వేడినీళ్లకే లేదా ఎప్పుడూ చన్నీళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం కొందరికి అలవాటు. అది ఒకందుకు మంచిదే.

అయితే, ఎంత చలికాలం అయినా, చన్నీళ్లతోనే స్నానం చేయడం లేదా ఎంత వేసవిలో అయినా వేడినీళ్లతోనే స్నానం చేయడం అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. మరయితే ఏ నీటితో స్నానం చేయడం మంచిదో తెలుసుకుందామా?

రెండూ అపోహలే
దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలసట తీరిపోయి హాయిగా అనిపిస్తుందంటారు. నిజానికి ఈ రెండూ సరయినవి కావు. రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు.

మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో చేసే స్నానమే ఒంటికి ఆరోగ్యకరం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయవద్దు. 

అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.

ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది.

ఒకవేళ మీరు చిన్నప్పట్నుంచీ చన్నీళ్ల స్నానమే చేస్తూ వస్తున్నారా? లేదా మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం వ్యవధిని వీలైనంత కుదించండి. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలన్నమాట.  

చన్నీళ్లతో లేదా వేణ్ణీళ్లతో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్‌ అవ్వండి.  

చదవండి: Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!
Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..

Videos

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)