Breaking News

నెయ్యి టీ నా..! ఎన్ని లాభాలో తెలుసా?

Published on Fri, 09/13/2024 - 12:29

గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, నిమ్మ టీ వంటి ఎన్నో రకాల చాయ్‌లు గురించి విన్నాం. కానీ ఇదేంటి 'నెయ్యి టీ' అని అనుకోకుండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు వారంలో కనీసం రెండుసార్లు ఈ టీని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..

'నెయ్యి టీ' అనేది కొత్తగా వచ్చిన వంటకం ఏం కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగించేవారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు చరక సంహితలో రోజువారీ వినియోగానికి అవసరమైన 11 ప్రధాన ఆహారాలలో దీన్ని ఒకటిగా చెప్పారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని సాధారణ టీ మాదిరిగానే చేసుకుంటారు. అయితే చివర్లో ఓ టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసుకుంటే అదే నెయ్యి టీ. ఇది తాగేందుకు టేస్టీగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందట. 

అదెలా అంటే..?

  • తక్షణ ఎనర్జీని పొందిన ఫీల్‌ లభిస్తుందట. అందువల్ల చిరుతిండులు తినాలనే కోరికన నివారించడమే కాకుండా ఎక్కువసేపు శక్తిమంతంగా ఉండొచ్చు.

  • ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా శీఘ్ర శక్తిని పొందడంలో సహాయపడుతుంది.

  • మలబద్ధకం, జీర్ణ సమస్యలకు చెక్‌ పెడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్‌ యాసిడ్‌ జీర్ణక్రియను సులభతరం చేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

  • ప్రకాశవంతంమైన చర్మాన్ని పొందొచ్చట. క్రమం తప్పకుండా తాగితే చర్మానికి మంచి పోషణను అందిస్తుందట. ఇందులో ఉండే విటమిన్లు, ఏ, డీ, ఈ, కేలు చర్మాన్ని హైడ్రేట్‌ చేసి,  పునరుజ్జీవింప చేస్తాయి. 

  • రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. బ్లడ్‌ షుగర్‌కి చెక్‌ పెడుతుంది.

అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ పానీయాన్ని కనీసం వారానికి రెండుసార్లు అయినా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో తీసుకోవడం మంచిదని అన్నారు. ముఖ్యంగా వ్యాయమాలు చేసేవాళ్లకు ఈ టీ మరింత మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.  

(చదవండి: రెడ్‌లైట్‌ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!)

 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)