Breaking News

కెరీర్‌లో ఎదగాలంటే.. ఈ అలవాటు తప్పనిసరి!

Published on Sat, 08/08/2026 - 03:42

క్షణక్షణానికి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రపంచంలో అప్‌స్కిల్లింగ్‌ అనేది ఎంతోముఖ్యం. నేడు ఉద్యోగ భద్రత అనేది అనుభవం కంటే.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. మారుతున్న సాంకేతికత, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పాత పద్ధతులు కనుమరుగవుతున్నాయి. అందువల్ల అప్‌స్కిల్లింగ్‌ అనేది ‘ఒక ఎంపిక కాదు, ఒక తప్పనిసరి అవసరం’. ముఖ్యంగా గృహిణులుగా స్థిరపడిన వారు, కెరీర్‌ బ్రేక్‌ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగ బాట పట్టాలంటే అప్‌స్కిల్లింగ్‌ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు.

నిరంతర అభ్యాసం
నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థ కేవలం అప్డేటెడ్‌గా ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. డిజిటల్‌ అక్షరాస్యత, విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలకు అన్ని రంగాలలో గిరాకీ పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, మనపై మనకు నియంత్రణ ఉండటానికి ఈ అప్‌స్కిల్లింగ్‌ తోడ్పడుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాధికారం పదునుదేలుతుంది. ముఖ్యంగా ఇది మహిళలకు ఎంతో అవసరం. ఆర్థికంగా బలోపేతం కావాలంటే నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలి.

లోతైన అవగాహన ముఖ్యం
ఏదయినా స్కిల్‌ నేర్చుకున్నపుడు దానిపై లోతైన అవగాహనను పెం΄÷ందించుకోవాలి. కేవలం కంటెంట్‌ను నేర్చుకోవడం మాత్రమే కాకుండా, క్లిష్టమైన పని వాతావరణంలో కూడా ఆ జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో అమలు చేసే సామర్థ్యం పెరగాలి. డిజైన్, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు కేవలం తమ రంగానికే పరిమితం కాకుండా, సంబంధిత ఇతర రంగాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. ఈ విస్తృత అవగాహనే విజయానికి దారులుపరుస్తుంది. అలాగే శిక్షణ అనేది పనికి దూరంగా ఉండే ప్రక్రియ కాదు, రోజువారీ ప్రాజెక్టులు సమస్యల పరిష్కారంలో భాగమైనప్పుడే దానికి సార్థకత ఉంటుంది.

సర్టిఫికెట్లతో రాణించలేరు!
ఎక్కువ మంది కెరీర్‌ ప్రారంభంలో మాత్రమే కొత్త విషయాలను నేర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తారు. కానీ నేర్చుకోవడం అనేది కొంతసమయానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది జీవితాంతం కొనసాగాలి. ముఖ్యంగా విరామం తర్వాత తిరిగి ఉద్యోగాల్లోకి చేరాలనుకునే మహిళలకు, కొత్త సాంకేతికతకు అలవాటు పడాలనుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుత కాలంలో షార్ట్‌ కోర్సులు, బ్లెండెడ్‌ లెర్నింగ్‌ వల్ల మనం చేస్తున్న పనులను ఆపకుండానే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. కేవలం సర్టిఫికెట్ల కోసం కాకుండా, వాస్తవ ప్రపంచంలో ఉపయోగపడే ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ టూల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై దృష్టి్ట పెట్టాలి. ఇవి కేవలం ఉద్యోగ అవకాశాలనే కాకుండా, మన దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా పెంచుతాయి.

విజయం వరించకపోవచ్చు..
కొత్త విషయాలను నేర్చుకునే క్రమంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. కానీ ప్రయత్నం మానకూడదు. ఏదయినా కొత్త అంశం నేర్చుకున్నపుడు ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ఆ స్కిల్‌తో వచ్చిన జ్ఞానం ఎప్పటికీ ఉండిపోతుంది. అలాగే ప్రయోగాలు చేయడం నైపుణ్యాలను పెం΄÷ందించుకోవడంలో ఒక ముఖ్యమైన అంశం. ప్రతి ప్రయోగం విజయవంతం కాకపోవచ్చు, కానీ ప్రతి ప్రయోగం లోతైన అవగాహనను కలిగిస్తుంది. నూతన ఆవిష్కరణలను ్రపోత్సహిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది.

గతంలో ఒక్కసారి నేర్చుకున్న విద్య దశాబ్దాల పాటు కెరీర్‌కు ఊతమిచ్చేది. ఇప్పుడు ఐటీ, బ్యాంకింగ్, తయారీ, ఆరోగ్యం.. ప్రతి రంగంలో ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త టెక్నాలజీ వస్తోంది. అందుకని రోజురోజుకీ మారుతున్న అంశాలపై కేవలం శిక్షణ తీసుకోవడమే కాకుండా, ఆ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే అసలైన విజయం. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే నిరంతర అభ్యాసం ఒక్కటే మార్గం. నైపుణ్యాన్ని పెంచుకున్న వారే రేపటి విజేతలుగా నిలుస్తారు.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)