జూన్‌ రెండోవారం దాటినా.. వర్షాల జాడేది? ఇంకా మండుతున్న ఎండలు

Published on Fri, 06/16/2023 - 13:44

మే నెల ముగిసింది.. సాధార‌ణంగా జూన్ ఒక‌టో తేదీన కేర‌ళ‌లోకి రుతుప‌వ‌నాలు ఎంట‌ర్ అవుతాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంటుంది. కానీ జూన్‌ రెండోవారం దాటినా ఇంకా వరణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇంకా భానుడి భగభగలతో జనాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి ఉంది? వర్షాకాలం మొదలైనా ఇంకా ఎందుకు ఎండలు మండిపోతున్నాయి? అసలు వర్షాలు పడేదెప్పుడు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

గడిచిన 15 రోజుల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 75.3. మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా రాలలేదు. నైరుతి రుతు పవనాలు ఇంకా కేరళ తీరాన్ని తాకలేదు.మండుతున్న ఎండలు చూస్తుంటే ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితి కనబడడం లేదు. వర్షాకాలంలోనూ ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు.

రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం హీట్‌వేవ్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వ‌ర్షాకాలం కాస్త ఆల‌స్యంగా దేశంలోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ప్రతి ఏటా జూన్‌ మాసం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.

జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా అంటే, 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు విస్తరించడానికి 5 రోజుల సమయం పడుతుంది.నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పశ్చిమ దిశ, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా ఇంకా ఎండలు మండుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  రుతుపవనాల రాక ఆలస్యం అయినా ఒక్కసారి అవి ఎంటర్‌ అయ్యాక సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)