Breaking News

అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..!

Published on Mon, 08/18/2025 - 17:01

అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలనేది మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారాన్నే మనం తరతరాలుగా అనుసరిస్తున్నాం కూడా. అలాంటిది ఇటీవల కాలంలో అబ్బాయి-అమ్మాయి వయసు అంతరాలు ఎంతలా ఉన్నాయంటే..అమ్మాయి వయసే ఎక్కువగా ఉంటోంది. అలానే పెళ్లి చేసుకుంటున్నారు. అభిషేక్‌ ఐశ్వర్యరాయ్‌, ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌, కత్రినా-విక్కీ కౌశల్‌, సచిన్‌ టెండుల్కర్‌ అంజిలి వంటి ప్రముఖులంతా తమ భార్యల వయసు కంటే చిన్నవారే. దాంపత్య జీవితానికి వయసుతో సంబంధ లేదంటూ ఎంతో హాయిగా వైవాహిక బంధాన్ని లీడ్‌ చేస్తున్నారు వారంతా. తాజాగా ఆ కోవలోకి సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ కూడా చేరిపోయాడు. అసలు అమ్మాయిలంతా ఇలా వయసులో తమ కంటే చిన్నవారితో ప్రేమలో పడిపోవడానికి రీజన్‌ ఏంటీ..?. అసలు ఎందుకిలా ఇదొక ట్రెండ్‌లా మారిపోయింది..?

ఇవాళ అమ్మాయిలు వయసులో తమ కంటే చిన్నవారినే ఇష్టపడుతున్నారు. వారినే వరిస్తున్నారు కూడా. గతానికి మరింత భిన్నంగా ఇవాళ ఇలాంటి ట్రెండ్‌ ఎక్కువగా ఎందుకు సాగుతుందనే దానిపై పలు అధ్యనాలు కూడా జరిగాయి. అసలు మహిళలు తమ కంటే చిన్న వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడుతున్నారని సర్వే కూడా చేశారు. అందులో చాలా షాకింగ్‌ విషయాలే వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

పెద్ద వయసు మహిళలంతా తమ కంటే ఏజ్‌లో చిన్నగా ఉండే పురుషులతో బంధం ఏర్పుచుకోవాలని కోరుకుంటున్నారట. వారిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. చిన్నవయసు అబ్బాయితో డేటింగ్‌ చేస్తే..వాళ్లు ఎంతో కంఫర్ట్‌గా ఫీలవుతారట. తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందట. పైగా వాళ్లు ఎవ్వరినైన  సమ్మోహనంలోకి దింపగలం అనే భావన కలుగుతుందట. శారీరక సంబంధం పరంగా కూడా చిన్న వయసు వారైతేనే బెటర్‌ అట

అంతేగాదు దీనిపై ఇటీవల డేటింగ్ యాప్ 'బంబుల్' ఒక సర్వే  కూడా నిర్వహించింది. అందులో దాదాపు 60% మంది అమ్మాయిలు తమ కంటే చిన్నవారినే భాగస్వాములుగా కోరుకుంటున్నారట. మరోవైపు అబ్బాయి అమ్మాయిలు ఆలోచనల పరంగా సర్వే చేస్తే కూడా..సుమారు 63% మంది ప్రేమలో వయసు పట్టింపు లేదని విశ్వసిస్తున్నారట. ఈ వ్యక్తులు తమ కంటే పెద్దవారు లేదా చిన్నవారు ఇలా ఎవ్వరితోనైనా డేటింగ్‌ చేసేందుకు రెడీ అంటున్నారట. అన్నింట్ల కంటే ఆసక్తిని రేకెత్తించే అంశం ఏంటంటే సుమారు 35% మంది అమ్మాయిలు శారీరక సంబంధం కంటే భావోద్వేగ అనుబంధానికే ప్రాధాన్యత ఇవ్వడం. 

ఇదిలా ఉండగా..బాలీవుడ్‌ నటి, ఎంటర్‌ప్రెన్యూర్‌ పారుల్ గులాటి ఒక పాడ్‌కాస్ట్‌లో సంబంధ బాంధవ్యాలపై మారుతున్న యువత ఆలోచనతీరు అనే అంశంపై ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా తమ కంటే వయసులో చిన్న వారైన పురుషులనే పెళ్లిచేసుకుంటున్నారంటూ మాట్లాడటంతో ఈ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బహుశా చిన్నవాళ్లైతే తమకు నచ్చినట్లుగా నడుచుకుంటారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారనే అభిప్రాయం కావొచ్చని పేర్కొంది. 

పైగా వారితో మాట్లాడటం సులభంగా ఉంటుందట. స్త్రీ సహజంగా తన మాట వినేవాళ్లను ఇష్టపడుతుంది ఆ కోణంలో ఇలా తన కంటే చిన్నవాళ్లని ఇష్టపడుతున్నట్లుగా పారుల్‌ చెప్పుకొచ్చింది. అలాగే బ్రేకప్‌ అవ్వడానికి గల కారణాల గురించి కూడా మాట్లాడింది. పురుషులు మారిపోయారని మహిళలు భావస్తారు, అలాగే పురుషులు మహిళలు తమను ఎప్పుడు వదిలి వెళ్లరని ప్రగాఢంగా నమ్మడం వంటి అంచనాల వల్లే బంధం విచ్ఛిన్నమవుతుందని చెప్పింది. 

అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న సందేహం రాగానే.. మారేందుకు ప్రయత్నించపోవడం, బహిరంగా మాట్లాడనప్పుడూ.. పెను సమస్యగా మారి విడిపోయేందుకు దారితీస్తుందని పేర్కొంది. కానీ ఈ జనరేషన్‌ యువకులు మునుపటికంటే భావోద్వేగ పరంగా తెలివిగా ఉంటున్నారు, అందుకే వారు వయసు అంతరానికి ప్రాధ్యానత్య ఇవ్వడం లేదని వివరించింది. 

(చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!)
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)