Breaking News

ఇంగ్లీష్‌లో అనర్గళంగా మట్లాడాలనుకుంటే..ఆమె ఇంటర్వ్యూ చూడాల్సిందే!

Published on Fri, 09/04/2026 - 15:45

చాలామంది ఇప్పుడు సునాయాసం ఆంగ్ల భాష నేర్చుకుంటున్నారు. ఏఐ పుణ్యమా అని మొబైల్‌లోనే ఈజీగా నేర్చుకుంటున్నారు. కానీ మంచి పదజాలంతో సందర్భానికి అనుగుణమైన పద ప్రయోగంతో ఆకట్టుకునేలా నైపుణ్యం సాధించాలంటే ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉండాలి. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ మాదిరిగా పొడి పొడి పదాలతో కాకుండా చాలా శక్తిమంతమైన ఇడియమ్స్‌తో అనర్గళంగా మాట్లాడుతుంటే ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. 

అంతేగాదు మన పనులను కూడా సునాయాసంగా చక్కబెట్టేయగలుగుతాం. ఇప్పుడిదంతా ఎందుకంటే బాలీవుడ్‌ ‍ప్రసిద్ధ నటి, మాజీ కేంద్ర మంద్రి బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ఇటీవలి ఇంటర్యూపై అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆమె అనర్గళమైన ఆంగ్లభాష ప్రసంగంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆంగ్ల భాష మెరుగుపరుచుకోవాలంటే ఆమె ఇంటర్వ్యూ చూస్తే చాలు కొత్త పదాలు నెన్నో నేర్చుకోవచ్చు, నిజంగా ఆమె ఓ ఆంగ్ల మాస్టర్‌ క్లాస్‌ అని అభివర్ణిస్తున్నారు అంతా. 

ఆమె ఇటీవల బర్ఖాదత్‌ షో 'వీ ది విమెన్'లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ, దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ మధ్య జరిగిన సంభాషణ అశేష ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఆమె అనర్గళంగా మాట్లుడుతున్న ఆంగ్లభాష శైలి అందర్నీ అటెన్షన్‌తో వినేలా చేయడమే కాదు..ఎంతో స్పష్టంగా, కచ్చితంగా వ్యక్తపరుస్తున్న విధానం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. 

ముఖ్యంగా ఆమె ఉపయోగించే పదజాలం, ఆత్మవిశ్వసంతో మాట్లుడుతున్న తీరు..ఆంగ్లభాష నేర్చుకోవాలనుకునే వారికి గొప్ప పాఠం అని అంటున్నారు నెటిజన్లు. కాగా, జర్నలిస్ట్ బర్ఖా దత్ ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయంగా తొలిసారిగా జరిగిన'వీ ది విమెన్' ఫెస్టివల్‌లో కరణ్‌జోహార్‌, స్మృతిల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి మరి. 
 

(చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! క్లయింట్‌ని వెతికిపెట్టినవారికి బంపరాఫర్‌)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)