Breaking News

బర్త్‌డే నాడు క్యాండిల్స్‌ ఎందుకు ఊదుతారు? దాని వెనకున్న కథేంటి?

Published on Tue, 07/18/2023 - 13:14

బర్త్‌డేలను సెలబ్రేట్‌ చేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. చిన్నాపెద్దా తేడా లేకుండా తమ స్థాయిని బట్టి స్పెషల్‌ వేడుకలను జరుపుకుంటారు. పుట్టినరోజు నాడు అందరూ కామన్‌గా చేసేది.. క్యాండిల్స్‌ ఊది కేక్‌ కట్‌ చేయడం. అసలు బర్త్‌డేలకు కేక్‌ ఎందుకు కట్‌ చేస్తారు? క్యాండిల్‌ ఊదడం వెనుక కారణాలు ఏంటి? అసలు ఈ కల్చర్‌ ఎక్కడినుంచి వచ్చింది అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..


బ‌ర్త్‌డేల‌కు క్యాండిల్స్ ఊది, కేక్ క‌ట్ చేయ‌డం అన్న సంప్ర‌దాయం ఇప్ప‌టిది కాదు. 1808వ సంవ‌త్స‌రంలోనే ఇది ప్రారంభ‌మైంద‌ని చెబుతారు. జ‌ర్మ‌నీలో అప్ప‌ట్లో కిండ‌ర్‌ఫెస్ట్ పేరిట కేవ‌లం పిల్ల‌లకు మాత్ర‌మే బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హించేవార‌ట‌. మ‌నం క‌ట్ చేసే సుతిమెత్త‌ని మృదువైన కేకులా మ‌న జీవితం కూడా సాఫీగా సాగాల‌ని నమ్ముతారు. అందుకే స్పెషల్‌ వేడుకల్లో కేక్‌ను కట్‌ చేస్తారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ కల్చర్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇక క్యాండిల్స్‌ ఊదే సంప్రదాయం మాత్రం గ్రీకుల కాలం నుంచి వచ్చిందని అంటారు.

గ్రీకు దేవత ఆర్టెమిను ఆరాధించడం కోసం కొవ్వొత్తులను వెలిగించేవారట.ఆమెను పూజించేటప్పుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్‌ వెలిగించేవారట. ఆ వెలుగు చంద్రుని ప్రకాశానికి ప్రతీకగా భావించేవారట. క్యాండిల్స్‌ ఊదడం వల్ల వచ్చే పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. అందుకే క్యాండిల్‌ ఊదేటప్పుడు మేక్‌ ఏ విష్‌ అంటారు.

అంటే మనం అనుకున్నది నెరవేరాలని మనస్పూర్థిగా ప్రార్థించడం. క్యాండిల్‌ పొగ దేవతను చేరుతుందని, అలా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలా అప్పటి నుంచి ఈ కల్చర్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. ఇదీ బర్త్‌డే నాడు క్యాండిల్స్‌ ఊదడం వెనకున్న కథ. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)