Breaking News

డ్యాన్స్‌ చేస్తే ఆ వ్యాధులు రావు! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published on Sun, 07/14/2024 - 12:41

జిమ్‌కి వెళ్లడం అనేది చాలా శ్రమతో కూడిన పని. పైగా వర్కౌట్లు, యోగా వంటివి కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. అదే డ్యాన్స్‌ అనంగానే కాస్త ఉత్సాహంగా ఆనందంగా చేస్తాం. శ్రమగా కూడా భావించం. ఒక్కసారిగా బాధలన్నీ మరిచిపోయి కాసేపు తేలికైపోతాం. అలాంటి డ్యాన్స్‌ని చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చట. అంతేగాదు కొన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాడీ ఫిట్‌నెస్‌ కోసం నృత్యానికి మించిన వర్కౌట్‌ లేదని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.

నృత్యం చేసినప్పుడు శరీరాన్ని కదిలించడమే గాక మెదడుకు పని కల్పిస్తుంది. దీంతో మెదడుకు ఓ చక్కని వ్యాయామం అందుతుంది. నృత్యంలో బ్యాలెన్స్కి, కొన్ని స్టెప్‌లు గుర్తుంచుకునేందుకు తగ్గట్టుగా మెదడులో షార్ప్‌గా అవ్వడం మొదలవుతుందని న్యూరో సర్జర్‌ ఆదిత్య గుప్తా చెబుతున్నారు. నృత్యం మనసును ఏకాగ్రతతో వ్యవహరించేలా చేస్తుంది. జ్ఞాపకశక్తికి వ్యాయామంగా ఉంటుంది. బీట్‌లకు తగ్గట్టు కాళ్లు, చేతులు తిప్పేలా మల్టీ టాస్క్‌ చేస్తారు. 

ఇది అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న రోగులకు డ్యాన్స్ చికిత్సగా కూడా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..? ఇది చూస్తూ.. వింటూ అనుకరిస్తూ తన శరీరాన్ని కదుపుతుంటారు కాబట్టి..నెమ్మదిగా బ్రెయిన్‌ ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది అధ్యయనంలో కూడా తేలింది. అంతేగాదు వృద్ధులపై జరిపిన అధ్యయనంలో కూడా మెరుగరైన ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. 

ఒత్తిడికి చెక్‌ పెడుతుంది..
డ్యాన్స్‌ ఒత్తడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్‌ల విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించేలా చేస్తుంది. డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌లు డిప్రెషన్‌, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. జీవన నాణ్యత, వ్యక్తుల మధ్య అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుతుందని పరిశోదన పేర్కొంది. 

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు బెస్ట్‌ వర్కౌట్‌ డ్యాన్స్‌. రెగ్యూలర్‌ డ్యాన్స్‌ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. 

  • గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

  • ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. 

  • నృత్యం శ్యాసకోశ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. 

  • బరువు నిర్వహణలో సహాయపడుతుంది 

  • బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్‌ ఉండేందుకు ఉపకరిస్తుంది. 

  • ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(చదవండి: రాయల్‌ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)