Breaking News

చెట్లను నరుకుతూ హరితహారాలెందుకు?

Published on Fri, 03/07/2025 - 14:43

సోలాపూర్‌–ధూళే నేషనల్‌ హైవేపై సర్వీసు  రోడ్డును నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ఏ  

ఓవైపు ‘హరితహారం’ఏర్పాట్లు ..మరోవైపు చెట్ల నరికివేత పనులు  

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుల్జాపూర్‌ నాక వాసులు 

సోలాపూర్‌: ఒకవైపు పట్టణవ్యాప్తంగా ‘హరితహారం’కోసం ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తుల్జాపూర్‌లో అందుకు భిన్నంగా చెట్ల నరికివేత జరుగుతోంది. దీంతో ఎస్‌ఎంసీ వైఖరి ఏమిటో అంతుబట్టడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోలాపూర్‌ – ధూళే నేషనల్‌ హైవేపై సోలాపూర్‌– తలే ఇప్పర్గా మార్గంలో నేషనల్‌ హైవే అథారిటీ సర్వీసు  రోడ్డును నిర్మిస్తోంది. ప్రతి ఏడాది తుల్జాపూర్‌లో జరిగే కోజగిరి పూర్ణిమ వేడుకల కోసం వేలాది భక్తులు ఈ మార్గం గుండానే కాలినడకన ప్రయాణిస్తారు. అలాగే పండరీపూర్‌లో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవాల కోసం వేలాది మంది వార్కారీలు, భక్తులు సాధుసంతుల పల్లకీలతో ఇదే మార్గంలో పాదయాత్రగా వెళుతుంటారు. వీరంతా మార్గమధ్యంలో ఈ చెట్లనీడనే సేదతీరతారు. ఇప్పుడా సౌకర్యం ఉండబోదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగా సర్వీసు రోడ్డు పనుల కోసమే చెట్లను నరికివేస్తున్నామని, పూర్తైన అనంతరం తిరిగి మొక్కలు నాటుతామని సోలాపూర్‌ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌ రాకేష్‌ జవాడే తెలిపారు.     

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)