Breaking News

నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..

Published on Sun, 09/21/2025 - 14:35

భారతదేశం అంతటా దుర్గమ్మ నవరాత్రుల సంభరాలతో కోలహలంగా మారింది. ఎటుచూసిన శరన్నవరాత్రుల సందడే కనిపిస్తుంది. రేపటి నుంచి మొదలుకానున్న ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో భక్తిప్రపత్తులతో కొలుచుకుంటారు. ఇక తొలిరోజు నుంచి దశమి వరకు నాన్‌ వెజ్‌ జోలికి వెళ్లకుండా, ఉల్లి, వెల్లుల్లిని లేకుండా ఒంటిపూట భోజనాలతో కఠిన నియమాలను అనుసరిస్తారు. ముఖ్యంగా భవాని మాలధారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతలానో కఠిననియమాలను అనుసరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారో తెలిసిందే. అంతటి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో అక్కడ మాత్రం దుర్గమ్మ తల్లికి చేప, చికెన్‌ వంటి నాన్‌వెజ్‌ ఆహారాలనే నైవేద్యంగా నివేదించడమే కాదు అవే తింటారట ఆ తొమ్మిది రోజులు. అదేంటని విస్తుపోకండి. ఇంతకీ అదెంత ఎక్కడో తెలుసా..!.

పశ్చిమబెంగాల్‌లో ఈ విభిన్నమైన ఆచార సంప్రదాయం ఉంది. అక్కడ బెంగాలీల కుంటుంబాలన్నీ నాన్‌వెజ్‌ వంటకాలతో ఘమఘమలాడిపోతుంటాయి. అక్కడ ఎక్కువగా మతపరమైన పండుగల్లో చేపలు, మాంసం వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయట. అక్కడ ఇలా మాంసాహారాన్ని నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారని చరిత్రకారుడు నృసింహ భాదురి చెబుతున్నారు. బెంగాల్‌లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం నివేదించడం ఉంటుందట. 

ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపమైన కాళి ఆరాధన ఎక్కువగా ఉంటుందట. ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి ఉంటాయట. ప్రసాదంగా వాటిని వండుకుని తింటారట. అంతేగాదు వేయించి కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్య సమర్పణ ఉంటుందట. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే కొన్ని ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందట. ఇక్కడ శాకాహారాన్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే..అక్కడ మాంసాహార సమర్పణను పవిత్రంగా భావిస్తారట.  

ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..

  • కోషా మాంగ్షో - నెమ్మదిగా వండిన మటన్ కర్రీ, ముదురు, రిచ్ అండ్‌ లూచీస్ (డీప్-ఫ్రైడ్ పఫ్డ్ బ్రెడ్) తో జత చేసింది. 

  • ఇలిష్ మాచ్ - ప్రియమైన హిల్సా, తరచుగా ఆవాలు లేదా వేయించిన బంగారు రంగులో ఉడికించిన వంటకం. 

  • బంగాళాదుంపలతో చికెన్ కర్రీ - ఇంట్లో ఇష్టపడేది, తరచుగా వారాంతపు కుటుంబ భోజనంలో భాగం. మటన్ బిర్యానీ, ముఖ్యంగా కోల్‌కతాలో బంగాళాదుంప ముక్కతో బిర్యానీ పవిత్రమైనదిగా పరిగణిస్తారట.

  • చేపల ఫ్రై, పులుసు: నవరాత్రుల్లో ఇది తప్పనిసరి వంటకం, భక్తులకు ప్రసాదంగా ఇచ్చే రెసిపీ కూడా. 

(చదవండి: ఢిల్లీలో జరిగే రామ్‌లీలా నాటకంలో పరశురాముడిగా బీజేపీ ఎంపీ)
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు