Breaking News

డాక్టర్‌ కాబోయి.. మేకప్‌ ఆర్టిస్ట్‌గా నం.1 స్థానం..

Published on Fri, 06/06/2025 - 08:52

26 ఏళ్ల మృణాల్‌ పంచల్‌ను దేశంలో అత్యధికమంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారట. కారణం? ఆమె రోజూ మేకప్‌ టిప్స్‌ చెబుతుంది. తన మీద మేకప్‌ అప్లయ్‌ చేసి క్షణాల్లో రీల్స్‌ తయారు చేసి ఆకట్టుకుంటుంది. ముఖాలను మార్చే ఈ కళతో తాజాగా వెలువడ్డ ‘కాండిరి హూరూన్‌ ఇండియాస్‌ లిస్ట్‌ ఆఫ్‌ లీడింగ్‌ ఉమన్‌  ఇన్‌ఫ్లూయెన్సర్‌’లో అగ్రస్థానంలో నిలుచుంది.

మనిషికి అత్యంత ఇష్టమైన వస్తువు తన ఖ్యాతికి కారణమవుతుందని మృణాల్‌ పంచల్‌ ఊహించి ఉండదు. మనిషికి ఇష్టమైనది ఏది? అద్దం. అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు మనిషి ఏమనుకుంటాడు? కాస్త బాగా కనిపిస్తే బాగుండు అనుకుంటాడు.

అలంకార ప్రియులైన స్త్రీలు ఈ మాటను ఇంకా ఎక్కువగా అనుకుంటారు. ఇక్కడే మృణాల్‌ పంచల్‌ గెలిచింది. ఏదో కాలక్షేపంగా తాను వేసుకునే మేకప్‌ను చూపుతూ చేసిన వీడియోలు ఆమెకు భారీగా మహిళా ఫాలోయెర్స్‌ను సంపాదించి పెట్టాయి. 

ఇన్‌స్టాలో ఆమెకు 55 లక్షల మంది ఫాలోయెర్లు ఉన్నారు. ఆమె వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ఇంతకీ కంటెంట్‌ కేవలం మేకప్పే. అందుకే ఆమె ‘కాండిరి హూరూన్‌ ఇండియా విమెన్‌ లీడర్స్‌ లిస్ట్‌ 2025’లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ఎవరు ఈ మృణాల్‌ పంచల్‌.

డాక్టర్‌ కాబోయి...
చాలామంది సినిమా హీరోయిన్లు డాక్టరు కాబోయి యాక్టర్‌ అయ్యాను అంటుంటారు. మృణాల్‌ పంచల్‌ కూడా అంతే. గుజరాత్‌లో పుట్టి పెరిగిన మృణాల్‌ ఎం.బి.బి.ఎస్‌. చేసేందుకు అవసరమైన చదువు/శిక్షణ కోసం పూణె వచ్చింది. ‘మా అమ్మతో శపథం చేసి మరీ వచ్చాను. 

అయితే నేను ఒకటి తలిస్తే మేకప్‌ మరొకటి తలిచింది’ అంటుంది మృణాల్‌. చిన్నప్పుడు తల్లి నిద్రపోతుంటే మేకప్‌ కిట్‌ తీసుకుని ఆమె ముఖానికి మేకప్‌ వేసి ఆశ్చర్యపరిచిన మృణాల్‌ స్కూల్లో చదివేప్పుడు కూడా రకరకాల పద్ధతుల్లో మేకప్‌ వేసుకుని కాలక్షేపం చేసేది. అయితే అందులో సహజమైన ప్రతిభ చాలామందిని ఆకర్షించింది.

చదవలేక...
అయితే పూణె వచ్చాక భాష సమస్య ఆ తర్వాత చదువు తలకు ఎక్కక పోవడంతో మృణాల్‌ ఒక దశలో కుదేల్‌ అయ్యింది. ఇక ఇంటికి పోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నప్పుడు టిక్‌టాక్‌లో కాలక్షేపానికి మేకప్‌ ట్యుటోరియల్‌ అంటూ ఒక వీడియో చేసింది. 

అది వైరల్‌గా మారింది. స్త్రీలు కింద కామెంట్లు పెట్టి ఇలాంటివే చేయండి అనసాగారు. మేకప్‌ను వేగంగా, సులువుగా, మనిషిని బట్టి, చర్మాన్ని బట్టి, కన్ను ముక్కును బట్టి, వయసును బట్టి ఎలా వేసుకోవాలో రకరకాల టిప్స్‌ చెబుతూ సొంతంగా ఆ మేకప్‌ను వేసుకుని చూపుతూ మృణాల్‌ అతి త్వరలో ఖ్యాతి గడించింది.

వెంటబడ్డ కంపెనీలు
మృణాల్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ టిక్‌టాక్‌ తర్వాత ఇన్‌స్టాలో పెరగడంతో బ్యూటీ సామాగ్రి అమ్మే బడాబడా కంపెనీలు ఆమెను తమ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేయమని కోరాయి. ‘అతి త్వరగా నేను ముంబైకి మారాల్సి వచ్చింది. నేను కలలో కూడా ఊహించని పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ కోసం నన్ను అంబాసిడర్‌గా పెట్టుకున్నాయి. నా ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది’ అని చెప్పుకొస్తుంది మృణాల్‌.

సరళంగా, అట్టహాసంగా: మృణాల్‌ భారతీయ మహిళల మనస్థితిని బట్టి మేకప్‌ టిప్స్‌ చూపుతుంది. ‘మన మహిళలు గ్లామర్‌గా మేకప్‌ వేసుకోవాలనుకుంటారు. కాని జంకుతారు. సరళమైన మేకప్‌ చూపిస్తే ఇంకొంచెం గ్లామర్‌ యాడ్‌ చేయమని కోరుతారు. రెండు విధాలుగా సంతృప్తి పరుస్తూ వారికి టిప్స్‌ అందిస్తుంటాను’ అంటుంది మృణాల్‌. 

ఆమె చూపే టిప్స్‌లో కేశాలంకరణ, వాటి షేడ్స్, కనురెప్పలు, ముక్కును సన్నగా చూపించడం, పెదాలను అందంగా చూపించడం, ముఖంలో ఏదైనా ఒక భాగం మోతాదుకు మించి ఉన్నా, కురచగా ఉన్నా దానిని మేకప్‌లో సరి చేసి చూపించడం చాలా ప్రతిభావంతంగా చేస్తుంది. అందుకే మృణాల్‌కు యాభై లక్షల మంది ఫ్యాన్స్‌.

సోషల్‌ మీడియా వచ్చాక చాలామంది విజేతలు మనకు కనిపిస్తున్నారు. అయితే వారంతా తొలిసారిగా ఎవరూ నడవని దారిని నడిచిన వారే. మేకప్‌ రంగంలో ఎందరో నిష్ణాతులు ఉండగా మృణాల్‌ దానినో ట్యూషన్‌గా భావించడం వల్లే ఘన విజయం సాధించింది. నేడు భారతదేశంలో అత్యంత ఇన్‌ఫ్లూయెన్షల్‌ లీడర్‌గా నిలిచింది. మృణాల్‌ నిజంగా గ్రేట్‌.

(చదవండి: శభాష్‌ మహిరమ..! జస్ట్‌ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది)
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)