Breaking News

ఒక్క జత స్నీకర్స్‌... ఐదు స్టయిల్స్‌!

Published on Sun, 07/26/2026 - 00:05

కొత్త డ్రెస్‌! అనిపించాలంటే ప్రతిసారి కొత్త బట్టలు కొనాల్సిన పనిలేదు. ఒక్క జత వైట్‌ స్నీకర్స్‌ ఉంటే చాలు! ఇవి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న ప్రతి డ్రెస్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేసి, ప్రతిసారి కొత్తగా చూపిస్తాయి. క్యాజువల్‌ నుంచి సెమీ ఫార్మల్‌ వరకు... ఒక్క జతతో ఎన్నో లుక్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. మరి వైట్‌ స్నీకర్స్‌ను స్టయిలిష్‌గా ఎలా ధరించాలో ఇక్కడ చూద్దామా!

సింపుల్‌ సూపర్‌!
కొన్ని లుక్స్‌ ఎక్కువ కష్టపడితే రావు... తక్కువ కష్టపడితేనే అదిరిపోతాయి! తెల్లటి టీషర్ట్, గ్రే డెనిమ్, వైట్‌ స్నీకర్స్‌... అంతే. ఈ కాంబినేషన్‌ ఎప్పటికీ ఔటాఫ్‌ ఫ్యాషన్‌ కాదు. సింపుల్‌గా కనిపించినా, అదే ఈ లుక్‌ ప్రత్యేకత. చేతికి ఓ వాచ్, కళ్లకు సన్ గ్లాసెస్‌ పెట్టుకుంటే... సింపుల్‌ లుక్‌ కూడా స్టార్‌ ఎంట్రీ ఇస్తుంది.

ఓపెన్‌ షర్ట్‌... ట్రెండీ టచ్‌!
వైట్‌ టీషర్ట్‌పై చెక్స్‌ షర్ట్‌ వేసుకోండి. కానీ ఓ చిన్న కండిషన్ ... బటన్లు మాత్రం వేయొద్దు! అదే ఈ లుక్‌లో అసలు ట్విస్ట్‌. బ్లూ జీ న్స్, వైట్‌ స్నీకర్స్‌తో బయటికి వస్తే... ‘ఈయన చాలా క్యాజువల్‌గా రెడీ అయ్యాడు... కానీ ఎందుకింత స్టయిల్‌గా ఉన్నాడు?’ అని జనాలు ఒక్కసారి చూసి మళ్లీ మళ్లీ చూస్తారు!

కూల్‌ హీరో!
షార్ట్స్‌తో ఏ షూ పడితే అది వేసుకుంటే... ‘వాకింగ్‌కా? వర్కౌట్‌కా?’ అనే డౌట్‌ వస్తుంది. అందుకే స్లిమ్, లో–కట్‌ వైట్‌ స్నీకర్స్‌ ఎంచుకోండి. సాక్స్‌ కూడా కనిపించకుండా చూసుకోండి. అప్పుడు సమ్మర్‌లో కూడా మీ స్టయిల్‌... ఐస్‌క్రీమ్‌లా కూల్‌గా ఉంటుంది!

చినోస్‌తో స్మార్ట్‌ లుక్‌
రోజూ అదే జీ న్స్నా? ఒక్కరోజు చినో ప్యాంట్‌ను బయటకు తీయండి. దానికి తెల్లటి షర్ట్‌ లేదా సాలిడ్‌ కలర్‌ షర్ట్‌ జత చేయండి. ఇంకో లెవల్‌కు వెళ్లాలంటే బ్లేజర్‌ కూడా వేసేయండి. ఆఫీస్‌లో అయినా... డేట్‌లో అయినా... ‘డ్రెస్‌ సె న్స్ బాగుంది!’అనే కామెంట్‌ గ్యారంటీ!

సూట్‌తో స్నీకర్స్‌... కొత్త ట్రెండ్‌! 
సూట్‌ అంటే ఫార్మల్‌ షూలే అనుకునే రూల్‌కు ఇప్పటికే రిటైర్మెంట్‌ వచ్చేసింది! ఇప్పుడు సూట్‌తో వైట్‌ స్నీకర్స్‌ వేసుకోవడం హాట్‌ ట్రెండ్‌. అయితే ఒక చిన్న సీక్రెట్‌... లోపల తెల్లటి షర్ట్‌ లేదా వైట్‌ టీషర్ట్‌ ఉంటే మొత్తం లుక్‌ చాలా నీట్‌గా, క్లాస్‌గా కనిపిస్తుంది. ఫార్మల్‌లో కూడా ఫ్యాషన్ కి ఫుల్‌ మార్కులు కొట్టేయొచ్చు!

స్టయిలింగ్‌ టిప్‌
వైట్‌ స్నీకర్స్‌ అందంగా కనిపించాలంటే వాటిని తెల్లగానే ఉంచాలి! మట్టి, దుమ్ము పట్టిన స్నీకర్స్‌తో ఎంత ఖరీదైన డ్రెస్‌ వేసుకున్నా... స్టయిల్‌ కంటే ‘షూ కడుక్కోలేదా?’ అనే ప్రశ్నే ముందొస్తుంది. కాబట్టి... స్నీకర్స్‌ను క్లీన్ గా ఉంచి, మీరు అడుగులు ముందుకు వేస్తే, ఎందరి చూపులో మిమ్మల్నే ఫాలో అవుతాయి.

∙కొండి దీపిక
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)