Breaking News

మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!

Published on Fri, 08/02/2024 - 10:26

బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్‌ ఫర్‌ చేంజ్‌. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్‌... ఇడ్లీతో ఈవెనింగ్‌ స్నాక్‌ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.

వీట్‌ వెజిటబుల్‌ దోసె..
కావలసినవి..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;
ఉప్పు – పావు టీ స్పూన్‌;
నీరు – పావు కప్పు;
టొమాటో ముక్కలు – పావు కప్పు;
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;
క్యారట్‌ తురుము – పావు కప్పు;
పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్‌;
కొత్తిమీర తరుగు– 2 టేబుల్‌ స్పూన్‌లు;
నూనె – 6 టీ స్పూన్‌లు.

తయారీ..
– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.
– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.
– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.
– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.
– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్‌ వీట్‌ వెజిటబుల్‌ దోసె రెడీ.

చిల్లీ ఇడ్లీ..
కావలసినవి..
ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;
రెడ్‌ చిల్లీ సాస్‌ – 2 టీ స్పూన్‌లు;
తరిగిన అల్లం – 2 టీ స్పూన్‌లు;
తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్‌లు;
తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్‌లు;
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;
క్యాప్సికమ్‌ ముక్కలు – అర కప్పు;
టొమాటో కెచప్‌ – 2 టేబుల్‌ స్పూన్‌లు;
చక్కెర– అర టీ స్పూన్‌;
వినెగర్‌– టీ స్పూన్‌;
సోయాసాస్‌ – టీ స్పూన్‌;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
నూనె – 3 టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ..
– పెనంలో రెండు టేబుల్‌ స్పూన్‌ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.
– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు, వేసి వేయించాలి.
– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్‌ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.
– ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్‌ చేయాలి.

ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్‌ ఆఫ్‌ హార్ట్స్‌’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)