Breaking News

స్టేటస్‌ ఏం చెబుతోందంటే..!

Published on Sat, 01/03/2026 - 12:21

ఇటీవలి కాలంలో చాలామందికి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకోవడం ఒక అలవాటుగా మారిందనేకన్నా వ్యసనంగా మారిందనడం కరెక్టేమో! ప్రతి చిన్న విషయాన్నీ వెంటనే స్టేటస్‌లో పెట్టేస్తున్నారు. ఒకోసారి అవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. అయితే అలా చీటికి మాటికీ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకోవడం కూడా మామూలు విషయం కాదనీ, దీని వెనక కొన్ని మానసిక కారణాలుంటాయనీ సైకాలజిస్టులు చెబుతున్నారు. 

సోషల్‌ మీడియా పెరిగిన తర్వాత మనుషుల జీవితం పబ్లిక్‌గా మారింది. సంతోషం వచ్చినా, బాధ కలిగినా దాన్ని లోపలే ఉంచుకోలేరు. వెంటనే దానిని స్టేటస్‌గా పెట్టుకోవడమో ఫేస్‌బుక్‌లో పెట్టడమో చేస్తున్నారు. తమ భావోద్వేగాలన్నింటినీ ఇతరులు పంచుకుంటున్నారు అన్న భావనే వారికి ఊరట ఇస్తోంది. ఈ అలవాటు క్రమంగా అవసరంగా మారుతోంది.

‘ఉనికి’ పాట్లు
స్టేటస్‌కు వ్యూస్‌ వస్తున్నాయా, రిప్లై వచ్చిందా అన్నదే కొందరికి ముఖ్యంగా మారింది. ఇది ఒక విధమైన మానసిక ధోరణిగా నిపుణులు చెబుతున్నారు. వారి స్టేటస్‌ను చూసి ఎవరైనా స్పందిస్తే ‘నన్ను గమనిస్తున్నారు’ అన్న భావన వారికి సంతోషాన్నిస్తుంది.

సమస్యేం కాదు కానీ... 
అప్పుడప్పుడు స్టేటస్‌ పెట్టడం సమస్య కాదు. కానీ ప్రతి భావాన్ని స్టేటస్‌ ద్వారానే చె΄్పాలి అన్న స్థితి వస్తే జాగ్రత్త అవసరం. నిజమైన సంభాషణ తగ్గి, వర్చువల్‌ స్పందనపై ఆధారపడటం మొదలైతే అది మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. సంతోషం, బాధ రెండింటికీ స్క్రీన్‌ మాత్రమే పరిష్కారం కాదు. కష్టసుఖాలలో తమకు తమకు తోడుగా ఉండే నిజమైన మనుషులే అసలైన పరిష్కారం అని గుర్తించాలి.

అసలు ఉద్దేశ్యం అదీ...
చాలా స్టేటస్‌లకు అసలు ఉద్దేశం అందరికీ చెప్పడం కాదు. తాము కోరుకునే ఒక ప్రత్యేక వ్యక్తి చూడాలి లేదా అర్థం చేసుకోవాలి అన్న కోరికే ప్రధాన కారణం. వారికి నేరుగా మెసేజ్‌ చేయలేక తమ ఫీలింగ్స్‌ను స్టేటస్‌ రూపంలో చెప్పే ప్రయత్నం ఇది. ఇది ‘ఇండైరెక్ట్‌ కమ్యూనికేషన్‌’ గా సైకాలజిస్టులు చెబుతున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)