Breaking News

విశ్రాంతి అంటే..?

Published on Mon, 08/18/2025 - 11:10

నీవు నీవుగా మిగిలిపోవడమే అసలైన విశ్రాంతి. ఎందుకంటే నీవు నీవుగా మిగిలిపోవడానికి ఏమైనా శ్రమ ఉందా? అస్సలు లేదు. కానీ మనిషి నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటూ విశ్రాంత స్థితి నుండి పక్కకు వెళ్ళిపోతున్నాడు. నీవు నీవు కావడానికి ఏమైనా శక్తి కావాలా? లేక ప్రయత్నం కావాలా? అసలు అలా ఉన్నప్పుడు అలసటనేదే ఉండదు.

నీ పేరు మైత్రేయ అనుకుందాం. ఎప్పుడైతే నీవు మైత్రేయ అనే వ్యక్తివి ఐనావో, నాకు ప్రాముఖ్యత కావాలి. నన్ను సమాజం గుర్తించాలి, నన్ను గౌరవించాలి అనుకున్నావు. అదే నువ్వు ఆత్మగా ఉన్నపుడు, సాక్షిగా ఉన్నపుడు ఇలా అనిపించదు. అంటే సమాజంలో ఎప్పుడూ ఒక వ్యక్తిలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఏది కాదో అది నిరూపించుకోవాలని అనుకుంటున్నావు. అలా ఏదో నిరూపించాలని అనుకుంటున్నావు కాబట్టే నీలో ఎప్పుడూ ఏదో అలసట ఉండే తీరుతుంది. అందుకే చూడు ఎప్పుడైనా నీవు బయటికి వెళ్ళేటప్పుడు బాగా బిగుసుకోని పోతావు. ఇంటికి రాగానే రిలాక్స్‌ ఐపోతావు. ఎందుకంటే ఇంటికొచ్చాక నీవు నీవైపోతున్నావన్నమాట. అంటే రిలాక్సేషన్‌కి కారణం నీవు నీ అంతరాత్మతో ఉండటమే. నీవు సమాజంలో కలిసినప్పుడల్లా నీవు కానిది చూపించాలను కోని ఏదో ఒకటి నటిస్తూ వ్యక్తిత్వం అనే ముసుగును వేసుకుంటూ నీ అంతరాత్మకు దూరంగా జరిగిపోతున్నావు. నీ నిజతత్వమైన ప్రశాంతతకు విశ్రాంతికి చాలా దూరమవుతున్నావు.

నీవు ఆత్మగా మిగిలిపోవడానికి ఏమీ చేయనవసరం లేదు. నీవు నీవుగా ఈ క్షణంలో సంపూర్ణత్వంతో మిగిలిపోతే నీవే ఆత్మ. ఆత్మ స్వయం ప్రకాశం అంటారు భగవద్గీతలో కూడా. సహజంగానే నీవు శాంతి, విశ్రాంతి మూర్తీభవించిన మనిషివి. నీలో లేనిది ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడూ ఇంకా ఏదో కావాలి అని వ్యక్తిగా కోరుకుంటూనే ఉంటాం. భగవద్గీత ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానికి చావులేదు. పుట్టుక లేదు. ఆత్మగా మిగిలిపోవడానికి ఏమైనా కావాలా? ఆత్మకు వస్తువులు, విషయాలు కావాలా? ఏమీ అబ్జర్లేదు. ఆత్మగా ఏదీ నీకు చెందదు. నీవు ఎవరికీ చెందవు. కానీ అన్నీ నీవే ఒక ఆత్మగా... దేవునిగా. అందుకే ఆత్మగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీవు అంతులేని ప్రకాశానివి, నీవే దైవానివి.
– స్వామి మైత్రేయ, 
ఆధ్యాత్మిక బోధకులు

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)