పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ అంటే..? మనసులో సునామిలా..

Published on Sun, 10/27/2024 - 10:50

అది ఇటీవల కేరళలో రుతూ ముంచేసిన బురద ప్రవాహమే కావచ్చు... లేదా అప్పట్లో చార్‌ధామ్‌ లో తుడిచిపెట్టేసిన వరద ప్రవాహమే కావచ్చు. అలనాటి సునామీ లేదా ఉత్తర కాశీ భూకంపమే కావచ్చు... ఇంకా యుద్ధ ఘటనలు.. దాడి లేదా దౌర్జన్యం, లైంగిక దాడి, ముష్కరులు మూకుమ్మడిగా విరుచుకుపడటం, గాయాలపాలు చేయడం, దోపిడీ... ఇలా ఏదైనా సరే అది మానసికంగా షాక్‌కు గురిచేయవచ్చు. ఇవే కాదు... తుఫాను, భారీ అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు, కుటుంబసభ్యులెవరైనా దూరం కావడం, హత్య, ఆత్మహత్య వంటి ఘటనల్లో  షాక్‌కు గురవుతారు. షాక్‌ తర్వాత బాధితులను నిస్తేజంగా మార్చే పరిస్థితిని పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’ (పీటీఎస్‌డీ) అంటారు. ఈ ‘పీటీఎస్‌డీ’ గురించి అవగాహన కోసమే ఈ కథనం.

పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ) బారిన పడ్డ వ్యక్తులు సురక్షితంగా ఉన్నప్పుడూ లేదా అలాంటి పరిస్థితులేమీ లేని సమయాల్లో కూడా తీవ్రంగా భయపడుతుంటారు. మిగతావాళ్లతో పోలిస్తే స్త్రీలు, పిల్లలు ఈ షాక్‌కు గురయ్యే ఛాన్స్‌ ఎక్కువ. 

పిల్లలైతే... 

  • ఎప్పుడో వదిలేసిన పక్క తడపడం వంటి అలవాటు పునరావృతం కావడం 

  • మాటలు మరచి΄ోవడం, మాటల కోసం తడుముకోవడం ∙హాయిగా,  ఆడుకోలేక΄ోవడం 

  • ఆత్మీయులైన పెద్దలను విడవకపోవడం. 

  • బాధితులతో వచ్చే ముప్పు... 

  • తమను తాము ఎంతో నిస్సహాయులుగా పరిగణించి బాధపడటం 

  • తీవ్రమైన భయాలతో ఎవరితోనూ కలవక, ఒంటరిగా ఉండిపోవడం 

  • తమను తాము బాధించుకోవడం, ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఒక్కోసారి ఎదుటివాళ్లపై దాడికి దిగడం. 
     

నిర్ధారణ... 

  • బాధితుల లక్షణాలనూ వాళ్ల మెడికల్‌ హిస్టరీని బట్టి 

  • బాధితుల స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను రాబట్టడం ద్వారా ∙కొన్ని మానసిక పరీక్షల ద్వారా.  
     

మేనేజ్‌మెంట్‌ / చికిత్స... 

  • సపోర్టివ్‌ థెరపీ, రీ ఎష్యూరెన్స్, యాక్టివ్‌ లిజనింగ్, కోపింగ్‌ స్కిల్స్‌ నేర్పడం వంటి చికిత్సలు.

  • ఎక్స్‌పోజర్‌ థెరపీ : ఒకేసారి ఆ సంఘటనను గుర్తు చేయకుండా మెల్ల మెల్లగా ఆ సంఘటన గురించి వివరిస్తూ, ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి మెల్ల మెల్లగా తీసుకెళ్తూ, ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదనీ, ఇకపై అక్కడ ఎంతమాత్రమూ హాని జరగదనే భరోసా కల్పించడం.              

లక్షణాలు... 

  • ఆ సంఘటన మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లే ఫీల్‌ కావడం లేదా ఆ సంఘటనలో ఉన్నట్లే ఫీలవుతారు. 

  • నిద్రలో పీడకలలు. అందులో అదే సంఘటన జరుగుతున్నట్లుగా కలలు వస్తాయి 

  • ఆ సంఘటన గురించి తలచుకోడానికి, మాట్లాడానికి ఇష్టపడకపోవడం 

  • ఎంత వద్దనుకున్నా మాటిమాటికీ ఆ సంఘటనల తాలూకు ఆలోచనలే రావడం

  • సంఘటన తాలూకు ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం 

  • ఆ టైమ్‌లో తమతో ఉన్న వాళ్లను కలవకపోవడం లేదా తప్పించుకుని తిరగడం ∙మూడ్స్‌ వేగంగా మారిపోవడం ∙ఒక్కోసారి ఆ సంఘటన తాలూకు ఎలాంటి జ్ఞాపకమూ లేకపోవడం 

  • ఆ సంఘటన గురించిన భయాలు, విపరీతమైన కోపం, సిగ్గుగా ఫీల్‌ కావడం 

  • ప్రతికూల ఆలోచనలే వస్తుండటం 

  • సంఘటన పట్ల తనను తానుగానీ లేదా ఇతరులను గానీ నిందిస్తూ ఉండటం 

  • ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరి గా ఉండటం 

  • ఒకప్పుడు తనకు సంతోషం కలిగించిన అవే పనులు ఇప్పుడు ఏమాత్రం ఆనందం ఇవ్వక΄ోవడం 

  • పరిసరాల పట్ల చాలా ఎక్కువ అనుమానాస్పదంగా ఉండటం 

  • ఏ విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, నిద్ర సమస్యలు (నిద్రపట్టక΄ోవడం లేదా ఎప్పడూ నిద్రలోనే ఉండటం).
    కాగ్నిటివ్‌ రీ కన్‌స్ట్రక్షన్‌  

ఆ సంఘటనలో బాధితుల ప్రమేయం లేదనీ, ఆ సంఘటన గురించి అపరాధభావనతో ఉండాల్సిన అవసరం లేదనీ, అప్పుడున్న మనుషుల నుంచి తప్పించుకుని తిరగాల్సిన పనిలేదనే నమ్మకాన్ని కల్పించడం. ఇలా సైకోథెరపీ చేస్తూ, ఆత్మహత్య ఆలోచనలనుంచి బయటపడేసే మందుల తోపోటు సెలెక్టివ్‌ సెరిటోనిన్‌ రీ–ఆప్‌టేక్‌ ఇన్హిబిటార్స్, సెరిటోనిన్‌ నార్‌ ఎపీనెఫ్రిన్‌ రీ అప్‌టేక్‌ ఇన్హిబిటార్స్, నార్‌ ఎపీనెఫ్రిన్‌–డోపమైన్‌ రీ అప్‌టేక్‌ ఇన్హిబిటార్స్‌ వంటి మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స అందిస్తారు. 

డా. శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌

(చదవండి: బాడీ పోశ్చర్‌(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్)

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)