Breaking News

కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?

Published on Thu, 10/10/2024 - 09:53

నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?
కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.

దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?
వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.

ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి  ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)