Breaking News

పాపరాజిలను ఎందుకు నిరోధించడం లేదు?

Published on Wed, 03/11/2026 - 17:48

కర్నాటకలో కదలిక మొదలయ్యింది. సినీ వేడుకలలో, ప్రయివేట్‌ ఫంక్షన్స్‌లో మహిళా సెలబ్రిటీలను, హీరోయిన్‌లను అభ్యంతరకరమైన యాంగిల్స్‌లో వీడియోలు తీసి రీల్స్‌గా సొమ్ము చేసుకుంటున్న పాపరాజిల మీద ప్రతిఘటన ప్రారంభమైంది. ‘మమ్మల్ని ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్దేశిస్తున్న వారు మా శరీరాన్ని అభ్యంతరకరంగా చూపుతున్నపాపరాజిలను ఎందుకు నిరోధించడం లేదు?’ అని అడుగుతున్నారు. కన్నడ తారలు రుక్మిణి వసంత్, సప్తమి గౌడ, అషిక రంగనాథ్‌ ఈ చర్చను లేవదీశారు. వివరాలు...

ఒక వృత్తిని సక్రమంగా చేసేవారు ఎందరో ఉంటారు. అదే వృత్తిని వక్రమార్గంలో చేస్తూ డబ్బు గడించాలని చూసేవారు కొందరు ఉంటారు. ఇలాంటి వారి వల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వచ్చే సందర్భం ఉంటుంది. సినీ ప్రపంచంలో తారల కార్యక్రమాల ప్రచారానికి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అవసరం. వారు తీసే ఫొటోలు, వీడియోల వల్ల తారలు పాల్గొన్న కార్యక్రమాలు తెలుస్తాయి. తమ అభిమాన తారలను ఆ విధంగా చూసి జనం సంతోషపడతారు.

ఇక్కడి వరకు ఎవరికీ అభ్యంతరం లేదు.
అయితే ఇటీవల తారల కార్యక్రమాల కవరేజ్‌కు వచ్చేవారి కన్నా వారు తమ కెమెరాలకు ఎక్కడ దొరుకుతారా ఏ అసభ్య యాంగిల్‌లో వారిని తీసి ఆ వీడియోను సొమ్ము చేసుకుందామా అనేవారు ఎక్కువగా తయారయ్యారు. వీరిని పాపరాజిలు అంటారు. ఇటీవల ఫోన్లలో రీళ్లు చూస్తున్నవారికి ఈ అసభ్య వీడియోలు తెలియనివి కావు. తారలు నడిచి వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వేదికలు ఎక్కుతున్నప్పుడు లేదా డాన్సులు చేస్తున్నప్పుడు కెమెరాను అనవసర భంగిమల్లో ఉంచి వారి శరీర కదలికలను స్లోమోషన్‌ చేసి రీల్స్‌గా విడుదల చేస్తున్నారు. 

వీటికి వ్యూస్‌ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు తారలు జిమ్, యోగా, ఎక్సర్‌సైజులు చేయడానికి వచ్చే సెంటర్‌ల దగ్గర కాపుకాచి వారు అందుకై వేసుకు వచ్చే దుస్తుల్లోనే వారిని అనుమతి లేకుండా వారి ఫొటోలు షూట్‌ చేసి వదులుతున్నారు. రాను రాను ఈ పాపరాజి బెడద ముదిరి బాలీవుడ్‌లో జయభాదురి లాంటి వాళ్ళు బహిరంగంగా నిరసన తెలుపుతుంటే ఇప్పుడు శాండల్‌వుడ్‌ (కన్నడ పరిశ్రమ)లో ఆ నిరసన మొదలైంది.

గతంలో నిరసనలు
2014లో దీపికా పడుకోన్‌ ఛాతీని ఒక దినపత్రిక అసభ్యరీతిలో ప్రచురిస్తే ఆమె ఎక్స్‌లో ప్రతిస్పందించారు. ‘నేను స్త్రీని. నాకు వక్షం ఉంటుంది. మీకేంటి సమస్య’ అని రాశారు. నోరా ఫతేహి, నేహా భాసిన్‌ వంటి తారలు కూడా పాపరాజిలను వ్యతిరేకించారు. అయితే పాపరాజిలు కూడా ఎదురు బెదిరింపులు చేస్తారు. ‘మీ కవరేజ్‌కు రాము’ అని బాయ్‌కాట్‌కు సైతం వెనుకాడటం లేదు. వీరి బెడద ఎక్కడి దాకా వెళ్లిందంటే ‘సంసారపక్షంగా దుస్తులు వేసుకొని తారలు వచ్చే వేడుకకు మేము వచ్చి చేసేదేముంది’ అనేవరకు వెళ్లారు. దాంతో సినిమాల పబ్లిసిటీ కోసం ట్రెండీ దుస్తులు వేసుకొని తారలు రావడం, పాపరాజిలు వారిని వక్రంగా చిత్రీకరించడం కొనసాగుతోంది.

సప్తమి గౌడ ప్రశ్న
‘బహిరంగ కార్యక్రమాలలో నటీమణుల వీడియోలు, చిత్రాలను అనుచిత యాంగిల్స్‌లో తీయడం ఏం పద్ధతి?’ అని  కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్‌ సప్తమి గౌడ తాజాగా ప్రశ్నించారు. అలా తీసిన చిత్రాలను వైరల్‌ చేసి, వారి శరీరాలను ప్రదర్శించే హక్కు ఎవరిచ్చారని అడిగారు. ‘ఇటువంటి పని చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. కొందరు పోటీ పడి మరీ ఇటువంటివి చేస్తున్నారు. వీటిని ఇప్పుడే ఖండించకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈవెంట్‌లను కవర్‌ చేసే వారు వారి మర్యాదను కాపాడుకుంటే బాగుంటుంది’ అని ఆమె అన్నారు. 

సప్తమి గౌడ మాటలకు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఆమెకు సపోర్టుగా కన్నడ పరిశ్రమకు చెందిన ఇద్దరు తారలు రుక్మిణి వసంత్, అషిక రంగనాథ్‌ కూడా ముందుకొచ్చి మాట్లాడారు. ‘సెలబ్రెటీలు మార్నింగ్‌ వాక్, జిమ్, బంధువుల ఇళ్లు, ఫంక్షన్లు, ఎయిర్‌పోర్ట్‌... ఇలా ఎక్కడికి వెళ్లినా వారిని అనుసరిస్తూ, వెంటపడుతూ ఫొటోలు తీయడం అలవాటుగా మారింది. సెలబ్రెటీల చిత్రాలకు సోషల్‌ మీడియాలో పాపులారిటీ దక్కడం, వాటిని కొన్ని పేజీలు డబ్బులిచ్చి కొనుగోలు చేయడం వంటి కారణాలతో ఈ ‘పాపరాజీ’ల పని కొనసాగుతోంది’ అని వారన్నారు. 

‘మమ్మల్ని ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్తున్నారుగానీ వీరెందుకు ఇలా మమ్మల్ని అసభ్యంగా తీస్తున్నారో ప్రశ్నించరేం?’ అని నిలదీస్తున్నారు. కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ విషయమై స్పందించాలని, కెమెరామెన్‌లకు నియమ నిబంధనలు విధించాలని కోరుతున్నారు. ఇలాంటి వీడియోలు ఫేక్‌ అకౌంట్స్‌ను నుంచి చలామణి అవుతుండటం వల్ల విచ్చలవిడితనం ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
 

(చదవండి: స్ట్రోక్‌ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)