Breaking News

ఆదర్శం అంటే..!

Published on Tue, 04/29/2025 - 12:28

ఆదర్శం అంటే దర్శనం చేయించేది: ‘చూపించేది’ అని అర్థం. మహనీయుల జీవితం మనకు సరైన నడవడిక ఎలా ఉండాలో చూపుతుంది కనుక అది మనకు ‘ఆదర్శం’. దస్తూరీ మెరుగు పరుచుకునేందుకు రాసే ‘కాపీ’ పుస్తకంలో, పేజీలో పైన ముద్రితమై ఉండే నమూనా పంక్తి– ‘మేలు బంతి’–ని చూసుకుంటూ, దాన్ని అనుకరిస్తూ కింద పదిసార్లు రాస్తే చేతి రాత బాగవుతుంది. ఆ నమూనా పంక్తిని కూడా ఆదర్శం అంటారు.
ఏదయినా జటిలమైన శాస్త్ర విషయానికి, ఆ శాస్త్రం బాగా నేర్చిన పండితుడు విపులంగా, సరళంగా వ్యాఖ్య రాసి పెడితే; అది ఆ శాస్త్రం తాలూకూ కిటుకులకూ, మర్మాలకూ అద్దం పట్టి మనకు చూపుతుంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఆదర్శాలే. ఉదాహరణకు కావ్య లక్షణాల గురించి దండి రంన గ్రంథం పేరు ‘కావ్యాదర్శం’.

వేదాంతవేత్తలు వివిధ సందర్భాలలో మనసునూ, బుద్ధినీ, చైతన్యాన్నీ అద్దంతో పోలుస్తారు. రజోగుణ సముద్భవమైన కామ– క్రోధాలు అనే లక్షణాలు... శుద్ధమైన మనిషి బుద్ధిని, స్వచ్ఛమైన అద్దాన్ని; మాలిన్యమూ, మసీ కప్పివేసినట్టు ఒక్కొక్కప్పుడు కప్పి వేస్తాయి. అప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. అలాంటప్పుడే మనిషి పాపకర్మల ఫలాలు దారుణంగా ఉంటాయని తెలిసి కూడా పాత కాలు చేస్తాడు. నవ్వుతూ చేసిన పాపాల కర్మలను తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడని భగవద్గీత బోధిస్తుంది.

మనం చూసే విశ్వమంతా ‘దర్పణ దృశ్యమాన నగరి’ (అద్దంలో కనిపించే నగరపు ప్రతిబింబం) లాంటిది అన్నారు ఆదిశంకరులు. బాహ్య ప్రపంచంలో విశేషాలన్నీ మన అంతఃకరణలో ప్రతిబింబించడం వల్లనే మనకు గోచరిస్తున్నాయి. మన చేతోదర్ప ణంలో బాహ్య ప్రపంచపు విశేషాలు ప్రతిబింబించకపోతే వాటి రపురేఖల, లక్షణాలూ మనం గ్రహించలేం. ఈ అద్దం లేకపోతే ఆ విశ్వం మనకు గోచరించదు. 

అద్దం మీద మోహమూ, భ్రాంతీ, అజ్ఞానమూ అనే మురికి పేరుకుపోతే కూడా మనకు మన కట్టెదుట ఉన్న సత్యం యథాతథంగా కనిపించదు. ఉన్నది కప్పబడి, లేనట్టుతోస్తుంది. అద్దం మీది మాలిన్యం వల్ల లేనిదేదో ఉన్నట్టు కనిపిస్తుంది. బుద్ధి అద్దానికి మకిలి పడితే మనం భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం.  ‘చేతో దర్పణ మార్జనమ్‌’ (బుద్ధిని శుద్ధి చేసే సాధనం) శ్రీకృష్ణ నామ సంకీర్తనం’ అని చైతన్య మహాప్రభువుల ‘శిక్షాష్టకం’ అంటుంది. దానివల్లనే ‘సమ్యక్‌ దృష్టి’ కలుగుతుంది.
– ఎం. మారుతి శాస్త్రి 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)