Breaking News

ఏ వయసులో ఏ ఆహారం?

Published on Sat, 06/29/2024 - 08:10

ఆహారానికి వయసు ఉండదు కానీ, ఏ వయసుకు తగ్గ ఆహారం ఆ వయసులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎదిగే వయసు పిల్లలు తీసుకోవలసిన ఆహారంలో ఉండవలసినవి వృద్ధులు తీసుకోవలసిన ఆహారం ఒకటి కాదు. అదేవిధంగా టీనేజీ అమ్మాయిలు, యాభైలలో ఉండే స్త్రీలు వేర్వేరు ఆహారాలు తీసుకోవాలి. ఇంతకీ ఏ వయసు వారు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో చూద్దామా?

ఇప్పుడు పిల్లలు తినే ఆహారంలోప్రోటీన్లు తక్కువ; పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి ఆహారం తినటం వల్ల వయసుకు తగిన పెరుగుదల ఉండదు. అధిక బరువు, హార్మోన్లలో మార్పుల లాంటి సమస్యలు  మొదలవుతాయి. కాబట్టి ఈ వయసు నుంచే సమతులాహారం ఇస్తూ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో హైపర్‌టెన్షన్, మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి గుడ్లు, ఆకుకూరలు, తాజాపళ్లు, కూరగాయలు ∙బాదం, వాల్‌నట్స్, వేరుసెనగ ∙గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు ∗మాంసం, చేపలు, జున్ను ∙రాజ్మా, సెనగలు, బొబ్బర్లు, సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇవ్వాలి.

15 నుంచి 25 ఏళ్ల వయసు
∙తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్‌ వండే విధానాలను నేర్చుకుని పిల్లల మనసు గెలవగలిగితే బజార్లో దొరికే ఫాస్ట్‌ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు ∙అలాగే మాంసాహారం వండేటప్పుడు ఎక్కువ నూనెలో వేయించకుండా ఆవిరి మీద ఉడికించి ఇవ్వాలి ∗మాంసాహారంతోపాటు కూరగాయలు కూడా ఇవ్వాలి ∗ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే పోటీన్‌ ఫుడ్‌ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది ∗ఉదయం అల్పాహారంలో బ్రెడ్, శాండ్‌విచ్‌లకు బదులుగా గోధుమ రవ్వతో చేసిన ఉ΄్మా, పెసలతో చేసిన ΄పోంగల్, పెసరట్టు, రాగి, క్యారట్‌ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి 

కేక్‌ల తయారీలో  డ్రై ఫ్రూట్స్, పళ్ల ముక్కలు ఎక్కువగా వాడాలి ∗బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి ∗ఫ్రిజ్‌ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా పళ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు ఉంచాలి. ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి ∗ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్‌బాల్, క్రికెట్‌లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి.

టీనేజ్‌లో... కొంతమంది టీనేజర్లు...మరీ ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరిగిపోతామనే బెంగతో తగినంత ఆహారం తీసుకోకుండా పోషక లో΄ాలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి టీనేజర్లను కనిపెట్టి తల్లులు పాష్టికాహారం వల్ల భవిష్యత్తులో ఒరిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించాలి ∗చిన్న వయసు నుంచే శరీరానికి పోషకాలు అందిస్తూ గర్భం దాల్చే సమయానికి శరీరాన్ని ఎలా సన్నద్ధం చేయాలో, అలా చేయకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో వివరించాలి ∗ఉదయం అల్పాహారం స్కిప్‌ చేయకుండా చూసుకోవాలి ∗తగినంత క్యాల్షియం, పోటీన్‌ తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఎత్తు పెరగటంతో΄ాటు, చక్కటి శరీర సౌష్టవం కూడా సొంతమవుతుంది.

45 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వరకూ...
∗ఈ వయసు స్త్రీలలో హార్మోన్ల స్రావాలు తగ్గిపోతాయి కాబట్టి శరీరం కాల్షియంను శోషించుకునే శక్తి కోల్పోతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పురుషుల్లో కండరాలు పటుత్వం కోల్పోతాయి కాబట్టి క్యాల్షియంను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం అవసరం. దీంతోపాటు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాల సప్లిమెంట్లను వైద్యుల సూచనమేరకు వాడాలి ∙ఈ వయస్కుల్లో కంటి చూపు, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే కాలిఫ్లవర్, క్యారెట్, చిలకడ దుంపలు, గుమ్మడికాయ మొదలైనవి తీసుకోవాలి ∙వాల్‌నట్స్, బాదం కూడా ఎక్కువగా తినాలి. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)