Breaking News

Ashtavakra అష్టావక్ర సందేశం

Published on Wed, 05/21/2025 - 10:15

మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది. అందులో ఒక కథను చూద్దాం. ఏకపాదుడు మహా తపశ్శాలి. గొప్ప విద్వాంసుడు. రాత్రింబవళ్ళు శిష్యుల చేత వేదాధ్యయనం, విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు. అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నపుడు గర్భంలోని శిశువు తండ్రితో, ‘నువ్వు రాత్రింబగళ్ళు విరామం లేకుండా శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నావు. నిద్ర లేకపోవడం వల్ల, విసుగు చేత వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి. అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?’ అని అన్నాడు. 

అప్పుడు ఏకపాదుడు, ‘నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్లుంది. అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి ‘అష్టావక్రుడవై పుట్టు’ అని శపించాడు. అతడు అలాగే పుట్టాడు. ఆ తర్వాత ఏకపాదుడు జనకమహారాజు ఆస్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి, ఓడి, బందీ అయ్యాడు. అష్టావక్రుడు పోయి వందితో వాదించి, ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు. (పుటలు 296–297–అరణ్యపర్వము–శ్రీమదాంధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).

ఇదీ చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?

నేడు ఎందరో తల్లితండ్రులు, కోచింగ్‌ సెంటర్‌ వాండ్లు వాళ్ళ పిల్లలకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని విరామంలేకుండా వారిని ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు. వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ పిల్లలు మానసిక రోగాలకు శారీరక రోగాలకు గురువుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు. వారు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అట్టి విద్య వల్ల ప్రయోజనం లేదంటుంది ఈ కథ. ఇక మహా తపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు. కోపం దుష్పలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ. శపించిన తండ్రినే విడిపించుకొని తెచ్చాడు కొడుకు. తల్లితండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ.
– రాచమడుగు శ్రీనివాసులు
 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)