Breaking News

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో వాడే నల్ల టమాటాల గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Fri, 07/28/2023 - 12:16

దేశ‌వ్యాప్తంగా ట‌మాట ధ‌ర‌లు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుడికి భారంగా మారిపోయిన టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకు టమోటాలు అనగానే ఎర్రగా నిగనిగలాడే టమోటాలు మాత్రమే ఉపయోగిస్తాం.

దాదాపు అందరూ ఎర్రటి టమోటాలనే కూర వండుకుని తింటారు. మరి నల్ల టమాటాల గురించి మీకు తెలుసా? క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో వాడే ఈ బ్లాక్‌ టమాటాల గురించి ఇంట్రెస్టింగ్‌ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం కూరగాయల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎగబాకాయి. రికార్డు స్థాయిలో ఆల్‌ టైమ్‌ ధరలను బ్రేక్‌ చేస్తూ ట‌మాట కిలో ఏకంగా రూ. 150 దాటి ప‌రుగులు పెడుతుంది. ప్రస్తుతం పెరిగిపోయిన రేట్ల కారణంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాట హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో టమాటాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది.

ఈ క్రమంలో బ్లాక్‌ టమాటాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా టమాటా ఎర్రటి రంగులోమెరిసిపోతుంటుంది. కానీ ఈ బ్లాక్‌ టమాటాల గురించి మీకు తెలుసా? ఎరుపు, ఊదా రంగు విత్తనాలతో ఈ నల్ల టమాటాలను పండిస్తారట. వీటిని ఇండిగో రోజ్‌ అని కూడా పిలుస్తారు.హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో ప్రస్తుతం ఈ నల్ల టమాటాలను సాగు చేస్తున్నారు.  ఈ బ్లాక్‌ టామాటాలు క్యాన్సర్‌తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది.

వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్లాక్‌ టమాటాలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు కూడా చాలా తక్కువ. బ్లాక్ టొమాటోలో ప్రొటీన్, విటమిన్ ఎ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి పోరాడటానికి ఈ బ్లాక్‌ టమాటాలు దోహదం చేస్తాయి. అందుకే యూరోపియన్ మార్కెట్లో దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తుంటారు. క్యాన్సర్‌ని అడ్డుకోవడంలో ఈ టమాటాలు బాగా పనిచేస్తాయి. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇన్ని బెనిఫిట్స్‌ ఉన్న బ్లాక్‌ టమాటాలు ధరతో పోలిస్తే కాస్త ఎక్కునేనట. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)