Breaking News

ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నా..! 36 ఏళ్లకు విముక్తి : వైరల్‌ స్టోరీ

Published on Thu, 12/05/2024 - 15:03

సోదరుడిని హత్య చేసిన ఆరోపణల కేసులో జీవిత ఖైదు అనుభవించి శతాధికవృద్ధుడిగా జైలునుంచి విడుదలైన  ఘటన వైరల్‌గా మారింది.  గత నెల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్డా కరెక్షనల్ హోం నుంచి  విడుదలయ్యాడో వ్యక్తి.   ఆయన పేరే 104 ఏళ్ల రసిక్‌ చంద్ర మోండల్‌. ‘‘జైలుకి ఎపుడొచ్చానో, ఎన్నేళ్లు గడిపానో గుర్తు లేదు. ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నాను’’ అంటున్న  రసిక్ చంద్ర  మాటలు పలువురిని ఆలోచింప చేస్తున్నాయి. 

పశ్చిమ బెంగాల్‌లోని  మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ నివాసి రసిక్‌ చంద్ర. 1988లో  స్వల్ప భూవివాదంలో సోదరుడిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. 1992లో మాల్డాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటికి మోండల్ వయస్సు 72 సంవత్సరాలు.  

కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో బెయిలుపై విడుదలయ్యాడు. కానీ దిగువ కోర్టు జీవితఖైదు విధించడం,హైకోర్టు దానిని సమర్ధించడంతో తిరిగి కరెక్షనల్ హోమ్‌కు వెళ్లక తప్పలేదు. ఆ తరువాత 2020లో పేరోలు మీద  బయటికి వచ్చి, మళ్లీ 2021లో కరెక్షనల్ హోమ్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జీవిత ఖైదుగా ఉన్నాడు. 

ఎలా విడుదలయ్యాడు
జీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి నిర్దేశించిన శిక్షాకాలంలో ఎలాంటి  అక్రమ చర్యలకు పాల్పడ కుండా, సత్ర్పర్తనతో ఉంటే, జైలు నుంచి విడుదలయ్యే  అర్హత ఉంటుంది. అలా 36 ఏళ్ల జైలు జీవితం తర్వాత  మాల్డా కరెక్షనల్ హోమ్ నుండి 104 ఏళ్ల వృద్ధుడిగా జనజీవితంలోకి వచ్చాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన తండ్రిని విడుదల చేసినట్లు మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్  తెలిపాడు. 

ఈ వయసులో కూడా మోండలు ఆరోగ్యంగా, చురుగ్గా  కనిపించడం విశేషం. ఎందుకంటే మోండల్ జైలులో నిత్యం వ్యాయామం చేసేవాడట. క్రమశిక్షణతో ఉంటూ వయసుకు తగ్గట్టు ఫిట్‌నెస్ పెంచుకున్నాడు.అంతేకాదు మొక్కలను పెంచడం, తోటపనిలో బాగా పాలు పంచుకునేవాడు. బయటికి వచ్చాక తన అభిరుచికి తగట్టి తోట పని  చేసుకుంటానని చెప్పాడు మోండల్‌.  అంతేకాదు తాను నిర్దోషిని, పరిస్థితుల  వల్ల తన పరిస్థితి ఇలా వచ్చిందని తెలిపారు. ఇన్నాళ్లుగాకుటుంబాన్ని, మనవలు మనవాళ్లతో గడిపేసమయాన్ని కోల్పోయాను అంటూ  వాపోయాడు.  అన్నట్టు మోండల్‌ భార్య మీనా ,ఇన్నాళ్లకు తన భర్త విడుదల కావడంపై సంతోషం ప్రకటించింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)