Breaking News

వెడ్డింగ్‌ సీజన్‌ : కోటలో రాజసంగా వివాహం

Published on Mon, 02/16/2026 - 15:38

ఆరావళి నీడలో వివాహ వైభవంసరస్సుల నగరంలో కళ్యాణ వైభోగంవసంత కాలాన రాజస్థాన్‌లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన  కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.రాజస్థాన్‌లో వెడ్డింగ్‌ సీజన్‌ అంటే ఒక రాజస అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కూడా. ఇక్కడి ఆరావలి పర్వత సిరుల మధ్య, సూర్యకాంతిని ప్రతిబింబించే జలసిరి సాక్షిగా జరిగే వివాహ వేడుక ఒక కళాత్మక సన్నివేశంలా అనిపిస్తుంది. ఈ భూమిలో పెళ్లి అంటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, అంతకు మించి జీవితాంతం నిలిచే మధురస్మృతి.

సరస్సుల మధ్య  వివాహ వైభవం
వెడ్డింగ్‌ సీజన్‌లో ఉదయ్‌పూర్‌ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సరస్సుల అందంతో ‘సిటీ ఆఫ్‌ లేక్స్‌’ గా పేరు  పొందిన ఈ నగరం సూర్యాస్తమయం వేళ వర్ణరంజిత దృశ్యంగా మారిపోతుంది. ఉదయ్‌పూర్‌ సిటీ ప్యాలెస్‌ ప్రాంగణంలో జరిగే అలంకరణ, బాల్కనీ నుంచి సరస్సును చూస్తూ గడిపే క్షణాలు వధూవరులకే కాదు అతిథులకు కూడా చిరస్మరణీయంగా నిలుస్తాయి. అందుకే పలువురు ప్రముఖులు ఇక్కడే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు.లేక్‌ పిచోలా మీద వెలిగే దీపాలు నీటిపై ప్రతిబింబించి కొత్త కాంతిని విరజిమ్ముతాయి. ద్వీపం మధ్యలో ఉన్న జగ్‌ మందిర్‌ సాయంత్రం వేళ  స్వర్ణకాంతితో ప్రకాశిస్తుంది. ఫతే సాగర్‌ సరస్సు తీరంలో ప్రభాత వేళ హల్దీ, మెహందీ వేడుకలు మరింత అందంగా కనిపిస్తాయి. పుష్పాల మధ్య నిలిచిన సహేలియోకి బరి ఉద్యానవనం ప్రీ–వెడ్డింగ్‌ వేడుకలకు సజావుగా సరిపోతుంది.

రాజస వేదికల  ప్రారంభం: రాజస్థాన్‌లో శరదృతువులో ప్రారంభమయ్యే వివాహాల సందడివసంతకాలానికి చేరుకునే సరికి మరింత ఉత్సాహంగా మారుతుంది. పగలు సూర్యకాంతి, రాత్రి దీపాల వెలుగులతో కోటలు మరింత మాయాజాలంలా కనిపిస్తాయి. ఇక్కడి కోటల్లో వైభవంగా కళ్యాణం చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు.  

పాలరాతి ప్రాంగణాల్లో రంగోలీలు చిత్రకథల్లా విరాజిల్లుతాయి. బ్యాండ్, బాజా, బారాత్‌ సందడితో సాయంత్రపు గాలి కూడా ఉత్సవ వాతావరణాన్ని అలుముకుంటుంది. ఈ రాజస భూమిలో వివాహ వేడుక ప్రకృతి మధ్యలో సాగే ఒక అనుభూతి. పర్వతాల నీడలో, సరస్సుల ప్రతిబింబంలో, ఎత్తైన కోటల మధ్య జరిగే కళ్యాణం ప్రతి క్షణం ఒక గీతంలా నిలుస్తుంది.

సాంస్కృతిక వేదిక
రాజస్థానీ పెళ్లి అంటే రంగుల పండుగ. బంధనీ వస్త్రాలు, పగిడీ అలంకారం, జానపద నృత్యాలు ఇవన్నీ కలిసి వివాహాన్ని మరింత ఉత్సవంగా మార్చేస్తాయి. మండపం మధ్య అగ్ని సాక్షిగా జరిగే వివాహానికి పర్వతాలు,  సరస్సులు, కోట శిఖరాలు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తాయి. స్థానిక కళాకారుల సంగీతం, ఢోలు శబ్దం, షెహ్నాయి స్వరాలు వేడుకకు భావోద్వేగాన్ని జోడిస్తాయి. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక అని చాటుతాయి.

ఉదయ్‌పూర్‌ రుచులు
రాజస్థాన్‌ భోజనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. దాల్‌ బాటీ చూర్మా, గట్టే కి సబ్జీ, వివిధ రకాల మిఠాయిలు, కచోరీలు, జిలేబీలు ఇవన్నీ వివాహ విందును మరింత రుచికరంగా మారుస్తాయి. పర్యాటనకు సరైన సమయం శరదృతువు నుంచి వసంతకాలం వరకు ఉదయ్‌పూర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్‌ నుంచి మార్చి మధ్య కాలంలో రాజస్థాన్‌ మరింత సుందరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో వివాహాల ఉత్సాహం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. రాజస్థాన్‌లో వివాహ సీజన్‌ అంటే రాజస శోభ, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక సంగీతం  కలిసిన ఒక సుగంధ అనుభూతి. ఫోటోల్లో కనిపించే దృశ్యాల కంటే గుండెల్లో నిలిచే జ్ఞాపకాలే ఎక్కువ. అందుకే అనేక మంది ఇక్కడ వివాహం చేసుకోవాలని కలలు కంటారు.

ఎలా వెళ్లాలి? : తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌కు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయుమార్గం ద్వారా మహారాణా ప్రతాప్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి ఉదయ్‌పూర్‌కు ప్రయాణించవచ్చు.  నగరంలోకి ప్రవేశించే సమయంలో పర్వతాల నీడలు, సరస్సుల అందాలు స్వాగతం పలుకుతాయి.

ఏం చూడాలి?
ఉదయ్‌పూర్‌లో సిటీ ప్యాలెస్, లేక్‌ పిచోలా, జగ్‌ మందిర్, ఫతే సాగర్‌ సరస్సు,  సహేలియోకి బరి వంటి ప్రదేశాలు వివాహ సందర్బంలో మరింత అందంగా కనిపిస్తాయి. సరస్సుల తీరాలు, కోటల శిల్పకళ నగర వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.

 – ఎం.జి. కిశోర్,ప్రయాణికుడు  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)