Breaking News

గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తప్పవు!

Published on Sun, 09/24/2023 - 10:11

ప్రపంచంలోని ఏ దేశంలో లేనంతమంది గుండెజబ్బు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఏటా  కోటీ 79 లక్షలమంది గుండెజబ్బులతో చనిపోతున్నారు. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బుల్ని చాలావరకు నివారించవచ్చు.  

గుండెకు చేటు తెచ్చిపెట్టే ఆరు ముఖ్యమైన అంశాలు... 

అధిక రక్తపోటు (హై–బీపీ) : ఇది ఓ సైలెంట్‌ కిల్లర్‌. దాదాపు 75% గుండెపోట్లకు కారణం. స్థూలకాయులు తమ బరువులో 10 శాతం తగ్గించుకున్నా ఏ మందులూ లేకుండానే హైబీపీని చాలావరకు అదుపు చేయవచ్చు.  

మధుమేహం: డయాబెటిస్‌ ఉన్నవారు చాలావరకు గుండెజబ్బుల బారిన పడుతుంటారు. అందుకే 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలను ఏడాదిలో కనీసం రెండుమూడుసార్లు  చేయించుకోవాలి.

ఒంట్లో కొవ్వులూ, కొలెస్ట్రాల్‌ : ఆహారంలో కొవ్వులతో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, గుండెకు చేటు తెచ్చిపెడుతుంది. 

దేహంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ : చాలాకాలం పాటు ఒత్తిడికీ, ఇతర దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్లకూ గురవుతూ ఉండటం, నిద్రలేమి, పొగతాగే అలవాట్లు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేందుకు దోహదపడతాయి. దాంతో రక్తంలోకి విషపూరితమైన రసాయనాలు విడుదలై రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. 

గుండెను దృఢంగా ఉంచుకోడానికి చేయాల్సినవి...

  • లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం.
  • ఒకేచోట కూర్చోకుండా నడక... సామర్థ్యం మేరకు పరుగు లేదా జాగింగ్‌.
  • కార్లూ, బైకులకు బదులు సైకిల్‌ వాడటం. ∙ఈత, తోటపని చేస్తూ ఉండటం. ∙పొగతాగడం, నిద్రలేమికి దూరంగా ఉండటం... ఇవన్నీ దేహానికీ, దాంతోపాటు గుండెకూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.  

    డా‘‘ ప్రదీప్‌ కె. రాచకొండ, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీ. 

(చదవండి: భార్య సిజేరియన్‌ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)