Breaking News

వయనాడ్ విలయం : ఆ చిన్నారి చెప్పిందే నిజమైంది! కానీ తండ్రి దక్కలేదు

Published on Sat, 08/03/2024 - 15:05

కేరళలోని వయనాడ్‌ ప్రకృతి ప్రకోపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఆచూకీ తెలుసు కునేందుకు సహాయక బృందం, అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విపత్తు గురించి ఓ చిన్నారి ముందే ఊహించిందా? గత సంవత్సరం తన పాఠశాల మ్యాగజైన్‌లో, 8వ తరగతి విద్యార్థిని లయ, జలపాతంలో మునిగిపోయిన బాలిక గురించి ఒక కథ రాసింది. అచ్చం వయనాడ్‌ విధ్వంసాన్ని  పోలిన ఈ కథ  బెస్ట్‌   స్టోరీగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ ‍ స్టోరీ వైరల్‌గా మారింది.

వయనాడ్ జిల్లాలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్న లయ అనే బాలిక రాసిన కథ ప్రస్తుత విధ్వంసాన్ని  కళ్లకు కట్టినట్లుగా  చూపించింది. జలపాతంలో మునిగి ఒక  అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్షిగా మారి, తిరిగి అదే గ్రామానికి తిరిగి వచ్చి రానున్న  పెను ముప్పు గురించి హెచ్చరిస్తుంది.  

"వర్షం కురిస్తే, కొండచరియలు జలపాతాన్ని తాకుతాయి,  ఆ ధాటికి అపుడు మానవ జీవితాలతో సహా మార్గంలో ఉన్న ప్రతిదానిని ముంచెత్తుతాయి" ఇదీ  ఆమె కథ సారాంశం. కథలో భాగంగా అనశ్వర, అలంకృత అనే ఇద్దరు స్నేహితులు తల్లిదండ్రులకు  చెప్పకుండా జలపాతం చూడటానికి వెళతారు. అపుడు "పిల్లలూ ఈ  ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది" అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఆ పిల్లలు పారిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి, బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తూ ఉంటుంది. అలా తనలాగా ఆ పిల్లలు  జీవితాలు బలికాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత విచిత్రంగా ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. 

వయనాడ్‌ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుతం కొండచరియలు సృష్టించిన విధ్వంసంలో లయ తండ్రి లెనిన్‌ను ప్రాణాలు కోల్పోవడం విషాదం. అంతేకాదు లయ చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 497 మంది విద్యార్థుల్లో  32 మంది ప్రకృతి బీభత్సానికి బలయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, అక్కాచెల్లెళ్లను కోల్పోయారు. అయితే స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ ప్రాంతంలోని రెండు పాఠశాలల నుండి నలభై నాలుగు మంది పిల్లలు తప్పిపోయారు. చాలామంది విద్యార్తులు తమ స్నేహితులను కోల్పోయిన షాక్‌లో ఉన్నారు. 
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు