Breaking News

రాముడు భూమిపై అవతరించినప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?

Published on Mon, 08/11/2025 - 11:05

విష్ణువు రాముడిగా... కృష్ణుడిగా... ఇంకా అనేక రూపాలలో భూమిపై అవతరించాడని అంటారు కదా... మరి ఆ రూపాలలో ఆయన భూమిపై ఉన్నప్పుడు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? ‘రామునిగా.. కృష్ణునిగా.. నారసింహుడిగా విష్ణువు భూమిపై అవతరించినప్పుడు ఆయా అవతారాలు పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?’ అనే విషయం తెలుసుకొనే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం...

ఒకేలా ఉండే పది ప్రమిదలలో ఒకేవిధమైన వత్తులు వేసి, నూనె  పోసి ముందు ఒక ప్రమిదను వెలిగించి, ఆ ప్రమిదతో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి; వేరే ఎవరినైనా ఈ ప్రమిదల వరుసలోని ఏ ప్రమిదతో నేను దీపం వెలిగించానో చెప్పగలవా అంటే ఆ వ్యక్తే కాదు ఎవరూ చెప్పలేరు; కారణంం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గదు. మిగిలిన ప్రమిదల్లాగే ప్రకాశిస్తుంది... 

అలాగే భగవంతుడు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడివిడిగా ఎత్తినా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా తన అసలు రూపంతో దర్శనమిస్తూనే ఉంటాడు... విష్ణువు నుంచి ఉద్భవించిన ఈ అవతారాలు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యమొందుతాయి... ఒకసారి ఐక్యమొందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే  ఉంటాయి.ఈ విధంగా అమ్మవారు అంటే లక్ష్మిదేవి కూడా భూలోకంపై అవతరించారు; అవతరిస్తారు.  అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకంపై అవతరిస్తూ ఉంటారు.
– డి.వి.ఆర్‌.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)