Breaking News

గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!

Published on Wed, 09/11/2024 - 15:15

క్షణికావేశంలోనో,  జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో  చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. 

జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక  విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.

వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర  పట్టాలపై  పడుకుంది.  ఇది గమనించిన రైలు డ డ్రైవర్‌ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.

 (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు)


 

 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది  తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది.  పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది.

 

కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య  చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా?  లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా?  ఇవన్నీ  ప్రస్తుతానికి సమాధానం లేని  ప్రశ్నలు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)