Breaking News

వాకింగ్‌ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?

Published on Fri, 08/16/2024 - 12:52

కొందరూ వాకింగ్‌ చేయడం వల్ల మోకాళ్ల సమస్య వస్తుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అందుకని వాకింగ్‌ మానేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సమస్య ఉన్నా కూడా మార్నింగ్‌ సమయంలో వాకింగ్‌కి వెళ్లడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. సమస్య తీవ్రతరం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. 

శారీరక, మానసిక ధృఢత్వం కోసం పూర్తి కార్డియో వ్యాయామాలు, నడక ఎల్లప్పుడూ మంచివి. ఉదయం నడకతో రోజుని ప్రారంభిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వాకింగ్‌ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా బరువు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది. అయితే నడిచే విధానంలో తప్పుడు విధానం లేదా భంగిమలో నడవడం కారణంగా దిగువ శరీరంగపై ఒత్తిడి ఎక్కువై మోకాళ​ నొప్పికి దారితీస్తోంది. అదికాస్తా దీర్ఘకాలిక ఆస్టియో ఆర్థరైటిస్‌ కారణమవుతుంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వాకింగ్‌ వెళ్లితే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

  • మార్నింగ్‌ వాకింగ్‌ ప్రారంభించే ముందే కొన్ని వార్మింగ్‌ అప్‌ వ్యాయామాలు చేయండి. ఇది మిమ్మల్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. నెమ్మదిగా శరీరాన్ని సాగదీయడం, కొద్దిపాటి ఎక్సర్‌సైజ్‌లతో శరీరంలో ఉష్ణోగ్రత వస్తుంది.  అందువల్ల సులభంగా నడవడగలుగుతాం.

  • అలాగే గోరు వెచ్చని నీటితో ఫ్రెష​ అయ్యాక వాకింగ్‌ వెళ్లండి. దీనివల్ల సులభంగా కదిలేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకింగచి కీళ్ల ద్రవం కదిలేందుకు సహాయపడుతుంది. 

  • ఎల్లప్పుడూ నడకని నెమ్మదిగా ప్రారంభించండి. ఈ నడక షెడ్యూల్‌ను దాదాపు పది నిమిషాల్లో చేసేలా సెట్‌ చేయండి. అలా రోజుకి 30 నిమిసాలు చేసేలా వేగం పెంచుకోండి. కాలక్రమేణ వేగంగా నడవగులుగుతారు, సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. 

  • రోజుకి కనీసం ఆరువేల అడుగులు వేయండి. ఆస్టియో ఆర్థరైటిస్‌ ఉన్నవారు రోజుకు కనీసం ఆరువేల అడుగులు నడిస్తే చాలప్రయోజనం ఉంటుంది. నడకను ట్రాప్‌ చేసేల ఫోన్‌ యాప్‌ని ఉపయోగించండి. 

  • ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. మడమపై ఒత్తిడి పడకుండా నడవగలిగేలా ఫ్లాట్‌, ఫ్లెక్సిబుల్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ 0.75 లేదా అంతకంటే తక్కువ ఎత్తులో ఉండే బూట్లను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

  • నొప్పి లేకుంటే కంటిన్యూగా నడవండి. అలా కాకుండా నొప్పి మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంటే ఒకటి లేదా రెండు నిమిషాలు బ్రేక్‌ తీసుకుంటూ ప్రయత్నించండి. 

  • అలాగే చదునుగా ఉండే మైదానం లేదా ఉపరితలంపైనే నడవండి. 

మోకాళ్లకు నడక ఎందుకు మంచిదంటే..?
మోకాళ్లలోని మృదులాస్థి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణను అందిస్తుంది. కీళ్లను కదిలించడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది ఎక్కువసేపు పనిచేసేందుకు ఉపకరిస్తుంది. రెగ్యులర్‌ వ్యాయామం కండారాలను మెరుగ్గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ వాకింగ్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

(చదవండి: ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)

 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)