Breaking News

Walkers Troubles నడక..నరకమే..!

Published on Mon, 05/05/2025 - 15:40

చార్మినార్‌: అసలే ఇరుకు రోడ్లు..ఆపై ఉన్న కొద్దిపాటి ఫుట్‌పాత్‌లు సైతం యథేచ్ఛగా ఆక్రమణలకు గురికావడంతో పాతబస్తీలో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు కొందరు షోరూం యజమానులు షాపుల ముందున్న ఫుట్‌పాత్‌లు తమ సొంతమన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరికి స్థానిక లోకల్‌ లీడర్లు, కొంతమంది ప్రభుత్వ విభాగాల సిబ్బంది, అధికారుల అండడండలు తోడవ్వడంతో ప్రశ్నించే వారే కరువయ్యారు. ఇప్పటికే చార్మినార్‌ పెడస్ట్రీయన్‌ ప్రాజెక్ట్‌ (సీపీపీ–చార్మినార్‌ కాలిబాట పథకం) పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా..ఇంకా పుట్‌పాత్‌లు అందుబాటులోకి రాలేదు. కొంతమంది సొంతంగా ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తుండగా..మరికొంత మంది షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు రోజు, వారం, నెలకు ఇంత...అంటూ అద్దెకు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

హైకోర్టు ఆదేశించినా..  
ఫుట్‌పాత్‌ కబ్జాలు తొలగించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన  ఆదేశాలతో నగరంలో వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం.. పాతబస్తీలో మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యాటక కేంద్రమైన చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్‌ తదితర ప్రదేశాలను సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాతబస్తీకి వస్తుంటారు. దీంతో ఇక్కడి రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారతాయి. అయితే ఫుట్‌పాత్‌లు లేకపోవడంతో వాహనాల మధ్య నుంచే రోడ్లపై బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని పాదాచారులు వాపోతున్నారు.  

రోడ్లుసైతం ఆక్రమణ.. 
పాతబస్తీలోఫుట్‌పాతులే కాదు..కొందరు రోడ్లను సైతం ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల చారి్మనార్‌ ట్రాఫిక్‌ పోలీసులు పత్తర్‌గట్టి నుంచి మదీనా వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. స్థానిక చిరువ్యాపారులు, షోరూం నిర్వాహకులు తమకు సహకరించడం లేదని దక్షిణ మండలం ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు.  

సమన్వయంతో పని చేస్తే.. 
జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సమన్వయంతో పని చేస్తేనే ఆశించిన ఫలితాలుంటాయి. అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్న వారిని కట్టడి చేయాలి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఫుట్‌పాత్‌ కబ్జాలు పూర్తిస్థాయిలో తొలగించాలి. చార్మినార్‌–మదీనా రోడ్డులో ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు, ఆక్రమణలను నియంత్రించాలి. రోడ్లపైనే నిల్చుని అమ్మకాలు చేస్తున్న వారిని క్రమపద్ధతిలో అనుమతించాలి. అలాగే ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన చోట సిబ్బంది సంఖ్యని పెంచడంతో పాటు ఇరుకు చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాలి.       

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)