Breaking News

క్రికెటర్‌ కోహ్లీ ఫాలో అయ్యే డైట్‌ ఇదే..!

Published on Fri, 08/16/2024 - 17:14

దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చూడటానికి బాలీవుడ్ హీరోల మాదిరిగా స్లైలిష్‌గా ఉంటాడు. బ్యాట్‌ పట్టుకుని మైదానంలోకి వెళ్లితే సిక్సర్‌లతో చెలరేగిపోతాడు. చూసేందుకు గాంభీర్యంగా, కూల్‌గా కనిపిస్తున్నా..క్రికెట్‌కి సంబంధించి ఎలాంటి ఒత్తిడిని భావోద్వేగ రూపంలో వ్యక్తం చేయకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌కి లుకింగ్‌ స్టైల్‌ని మార్చేస్తుంటాడు. అలాంటి ఈ యంగ్‌ క్రికెటర్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటి? ఎలాంటి డైట్‌ ఫాలో అవుతాడు వంటి వాటి గురించి తెలసుకోవాలని ఆరాట పడుతుంటారు అభిమానులు. ఇంతకీ అతడి ఫిట్‌నెస్‌, ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే.. 

35 ఏళ్ల క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ క్రమశిక్షణతో కూడిన డైట్‌ని, ఫిట్‌నెస్‌ని అనుసరిస్తాడు. అంతేగాదు ఐపీఎల్‌ వంటి సీజన్లలో కేవలం బేక్‌ చేసిన చికెన్‌, ఆవిరి మీద ఉడికించిన కూరగాయ ముక్కలతో ఫిట్‌నెస్‌ కాపాడుకున్నాడు. ఆహారం వద్ద చాలా స్ట్రిక్ట్‌ డైట్‌ని ఫాలో అవుతాడని అతడని జిమ్‌ కోచ్ తెలిపారు. కోహ్లీ ఆహారంలో రుచి కన్నా పోషకాలకే ప్రాధాన్యత ఇస్తాడు. అంతేగాదు అతడు తన శరీరానికి అవసరమయ్యే పోషకాల అవసరాన్ని అనుసరించే తీసుకుంటాడు.

ప్రయాణ సమయంలో ఉండేవి ఇవే..
విమాన ప్రయాణలో కోహ్లీ వెంట బ్యాగులో కాఫీసెట్‌, ప్రోటీన్‌ బార్‌, కొన్ని నెట్స్‌, తదితరాలు ఉంటాయి. వాటిని సమయాన్ని కేటాయించుకుని మరీ తింటాడు. చెప్పాలంటే..అరగంటకోసారి తింటాడట. 

కోహ్లీ డైట్‌ సీక్రెట్‌..

కోహ్లీ అనుసరించే డైట్‌, ఫిట్‌స్‌ సూత్రాలు మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని హెల్తీగా, ఫిట్‌గా ఉండొచ్చు. అవేంటంటే..

  • స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు, బలం, ఫ్లెక్సిబిలిటీని పెంచే హై ఇంటెన్సీటీ వ్యాయామాలువిరాట్ కోహ్లీ చేస్తాడు. 

  • సంవత్సరం మొత్తం క్రమం తప్పకుండా ట్రైనింగ్ షెడ్యూల్ను కోహ్లీ పాటిస్తాడు. స్కిప్‌ చేయకుండా స్ట్రిట్‌గా డైట్‌ ఫాలో అవ్వడమే అతడి ఫిట్‌నస్‌ సీక్రెట్‌.

  • క్రమశిక్షణే అతని ఫిట్‌నెస్‌కు మూల కారణం. విరామం సమయంలో కూడా వర్కవుట్ చేయడం వదిలిపెట్టడు.

  • అతని వర్కౌట్ ట్రైనింగ్, క్రికెట్ మ్యాచ్‌లకు తగ్గట్లుగా ప్లాన్‌ ఉంటుంది. కావాల్సిన శక్తి అందేలా, దానికి తగ్గట్లుగా ఆహార నియమావళి పకడ్బంది వ్యూహంతో వ్యక్తిగత నిపుణలు సెట్‌ చేస్తారు.

  • ఎక్కువ ఆహారం తీసుకోవడం కాకుండా పోషకాలపై దృష్టిపెడతాడు కోహ్లీ. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకుంటాడు.

  • ఎప్పుడూ శరీరం హైడ్రెటెడ్‌గా ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన ఆటకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాడు.

  • (చదవండి: గ్రీన్ టమాటాల గురించి విన్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..!)

 

 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)