Breaking News

ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..

Published on Tue, 07/25/2023 - 14:54

ఇటీవలకాలంలో సెల్ఫీ పిచ్చి మాములుగా లేదు. సెల్ఫీ మోజులోపడి వేగంగా వెళ్లే ట్రెయిన్‌ వద్ద, ప్రమాదకరమైన లోయలు, సముద్రంలోని అలలు వద్ద..సెల్ఫీలు తీసుకుని చనిపోయిన ఉదంతాలు చూశాం. అయినా సరే జనాలు తగ్గేదే లే! అంటున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రమాదరకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ అంటూ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి బంధువులు లబోదిభోమని పెట్టే కేకలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని చవిచూశాడు ఇక్కడొక వ్యక్తి.

30 ఏళ్ల గోపాల్‌ పుండ్లిక్‌ చవాన్‌ మహారాష్ట్రలోని అజంతా గుహాల సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉ‍న్న బౌద్ధ గుహ దేవాలయాలను చూస్తూ ఉండగా సమీపంలో ఉన్న నది అతడిని ఆకర్షించింది. ఇంకేముంది..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అంతే ఒక్కసారిగా ఆ నదిలో పడిపోయాడు. సరిగ్గా సమీపంలోనే..  గర్జించే జలపాతం. మంచి ఫోర్స్‌గా వస్తున్న నీటి ప్రవాహం చూస్తే.. ఆ వ్యక్తి రాళ్లు గుంటలపై కొట్టుకుపోయేలా ఉంది.  

అదృష్టవశాత్తు ఆ వ్యక్తి నీటిలోకి పడగానే ఈత కొట్టే యత్నం చేయడంతో వెంటనే అదికారులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేశారు. సుమారు 10 మందికి పైగా వ్యక్తుల తాడు సాయంతో ఆ వ్యక్తి లోయ నుంచి బయటకు తీశారు. కాగా, అతను భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టగట్టగలిగాడు కానీ లేదంటే చనిపోయేవాడని అధికారులు అంటున్నారు.

అతను పడిన వెంటనే గాభరాపడకుండా ఈత కొట్టే యత్నం చేశాడు కాబట్టే మాకు అతడిని రక్షించగలిగే సమయం దొరికిందని చెప్పుకొచ్చారు. చాలా మంది అతిడిలా అదృష్టవంతులు కాకపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక 2020 అధ్యయనం ప్రకారం షార్క్‌ దాడులతో చనిపోయే వారికంటే ఇలా నీళ్ల వద్దకు సెల్ఫీ కోసం వచ్చి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని పేర్కొనడం గమనార్హం. 

(చదవండి: గూగుల్‌ మ్యాప్‌లో వినిపించే వాయిస్‌.. ఏ మహిళదో తెలుసా?)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు