APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్
Breaking News
ఒక్క క్షణం ఆలస్యమైనా...
Published on Thu, 09/17/2026 - 07:44
రీల్ అద్భుతంగా రావాలి. ప్రత్యేకంగా కనిపించాలి. లక్షల వ్యూస్ కావాలి. అంతే అనుకున్నదేమో ఒక తల్లి. రీల్స్ మాయలో తన వెంట బిడ్డ ఉందనే సంగతిని కూడా మరిచిపోయింది. ఏమీ తెలియని ఆ చిన్నారి ప్రమాదపుటంచుల్లోకి వెళ్లినా పట్టించుకోలేదు.
ఆందోళన కలిగించే ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఓ మహిళ బ్రిడ్జిపై నిలుచుని రీల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వెంట ఉన్న చిన్నారి నెమ్మదిగా వంతెన అంచుల వైపునకు పాకుతూ వెళ్లింది. కానీ ఆ తల్లి కెమెరా వైపు చూస్తూ అదేమీ గమనించలేదు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి.. పాపను ప్రమాదం నుంచి రక్షించాడు.
ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలు స్పష్టంగా లేకపోయినప్పటికి .. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనలు, రోడ్లు, నీటి ప్రదేశాలు, ఎతైన ప్రాంతాల దగ్గర పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని గుర్తుచేస్తున్నారు. రీల్ కొన్ని సెకన్ల పాటే.. కానీ చిన్నారి భద్రత మాత్రం జీవితాంతం ముఖ్యమని సూచిస్తున్నారు.
Tags : 1